ఖాతాదారులకు మెరుగైన సేవలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:42 PM
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్‌బీఐ ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జిల్లారీజనల్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక టౌన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాతాదారుల హక్కుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్‌బీఐ ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జిల్లారీజనల్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక టౌన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాతాదారుల హక్కుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. టోల్ ప్రీ నెంబరు ద్వారా బ్యాంకింగ్‌సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి తేవడంతోపాటు ఎప్పటికప్పుడు ఖాతాదారులనుంచి ఫీడ్ బ్యాక్ తీసకొని సేవలను మెరుగుపరుస్తునట్లు తెలిపారు. ఎస్‌బీఐ గుంటూరు పరిపాలనా కార్యాలయ చీఫ్ మేనేజర్ సంజీవ్ కుమార్ బన్సల్ ఖాతాదారుల హక్కులు, బ్యాంక్ అందిస్తున్నసేవలు,సైబర్ మోసాల నుంచి ఎలా రక్షణ పొందాలి వంటి అంశాలను వివరించారు. ఖాతాదారులకు బ్యాంకు అందజేస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. మరణించిన వారి ఖాతాలకు సంబంధించి నామినీలు ఎక్కడైనా అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించామన్నారు. ఇటువంటి ఖాతాల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. డెబిట్, క్రిడెట్ కార్డు మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు కే రవికుమార్, వేదం రాజే్‌షబాబు, కే హారతి, హెచ్‌ఆర్ మేనేజర్ నళీనికాంత్, కే జానకిరామయ్య, అసోసియేషన్ నాయకులు వి. శ్రీనివాసరావు, సీహెచ్ శ్రీనివాసరావు, అవార్డు యూనియన్ నాయకులు సుధాకర్, పి.వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.