Share News

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:28 AM

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిం చాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ ఆదేశించారు. బుధవారం మద్దిపాడు లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.

 మెరుగైన వైద్య సేవలు  అందించాలి

ఇన్‌చార్జి కలె క్టర్‌ గోపాలకృష్ణ

మద్దిపాడు, జూలై9(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిం చాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ ఆదేశించారు. బుధవారం మద్దిపాడు లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ముందు గా ఆసుపత్రిలోని అన్ని గదులను, ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కౌంటర్‌ను, ఓపీలను, అత్యవసర సేవా విభాగాలను తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలలో ఉద్యోగ సిబ్బం ది జాబ్‌చార్టును అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. ప్రసవాలకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అ డిగి తెలుసుకున్నారు. వైద్యశాలకు వచ్చిన రోగులతో మాట్లాడారు. వైద్యసేవల గురించి ఆరా తీయగా సక్రమంగానే అందుతున్నట్లు రోగులు సమాధానం చె ప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఎంపీడీవో జ్యో తి, డాక్టర్‌ అన్వేష్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:29 AM