Share News

పేదలకు మెరుగైన వైద్య సేవలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:30 PM

పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన కంటి విభాగాన్ని ఎరిక్షన్‌బాబు సోమవారం ప్రారంభించారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు
ఆరోగ్య కేంద్రంలో కంటి విభాగాన్ని ప్రారంభించిన ఎరిక్షన్‌బాబు

కంటి విభాగాన్ని ప్రారంభిస్తున్న ఎరిక్షన్‌బాబు

పెద్ద దోర్నాల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన కంటి విభాగాన్ని ఎరిక్షన్‌బాబు సోమవారం ప్రారంభించారు. వైద్యం కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేయడం పేదలకు భరోసా అన్నారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలోనే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ నాగమహేశ్వరి, వైద్యులు సంజీవ్‌, లావణ్య, కృష్ణారెడ్డి, సిబ్బంది, సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు షేక్‌మాబు, దొడ్డా శేషాద్రి, మల్లయ్య, చంటి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, చెంచయ్య, సమ్మద్‌బాషా, బీజేపీ నేత గండి వీరారెడ్డి, జిల్లా నాయకులు అశోక్‌ రెడ్డి, సీతారెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు కేతి మురళి పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:30 PM