ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:13 PM
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సర్వజన వైద్యశాలను బుఽధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులలో తిరిగి రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ఓపీల సంఖ్యకు తగినట్లుగా సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు.
ఎమ్మెల్యే కందుల
మార్కాపురం రూరల్, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సర్వజన వైద్యశాలను బుఽధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులలో తిరిగి రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ఓపీల సంఖ్యకు తగినట్లుగా సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలన్నారు. అంబులెన్స్‌కు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆసుపత్రిలో ఆల్ర్టా సౌండ్ మిషన్, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐని త్వరలో ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఆర్వో ప్లాంట్ ద్వారా తాగు నీటిని అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రామచంద్రారావు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
కలుజువ్వలపాడులో భర్త హింసించిన బాధితురాలిని ఎమ్మెల్యే కందుల పరామర్శించారు. కలుజువ్వలపాడులో భర్త కట్టేసి కొట్టి హింసించిన ఆమె సర్వజన ఆసుపత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.