రెండు స్కూళ్లకు ఉత్తమ అవార్డులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:51 AM
జిల్లాలో రెండు స్కూళ్లు రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాలల అవార్డుకు ఎంపికయ్యాయి. ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబునాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి స్కూళ్లు పది ఉండగా అందులో రెండు మన జిల్లా నుంచే కావడం గర్వకారణం.
15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రదానం
ఒంగోలు విద్య, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రెండు స్కూళ్లు రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాలల అవార్డుకు ఎంపికయ్యాయి. ఈనెల 15న స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబునాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి స్కూళ్లు పది ఉండగా అందులో రెండు మన జిల్లా నుంచే కావడం గర్వకారణం. 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభను కనబర్చినం దుకు నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు ఏపీ రెసిడెన్షి యల్ బాలికల పాఠశాల, కొండపి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు ఈ అవార్డులు దక్కాయి. వీటిలో విద్యార్థినులు పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు సగటు మార్కులు కూడా అధికంగానే ఉన్నాయి. అమ్మనబ్రోలు పాఠశాల హెచ్‌ఎం కె.మాధవి, కొండపి పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.అరుణ సీఎం చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోనున్నారు.