Share News

‘దిత్వా’తో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:37 PM

దిత్వా తుఫాన్‌ ప్రభావంతో కోతకు వచ్చిన పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాఽధికారి ఎస్‌.శ్రీనివాసరావు రైతు లకు సూచించారు.

‘దిత్వా’తో అప్రమత్తంగా ఉండాలి
శివరాంపురంలో వర్షానికి తడవకుండా పదాలు కప్పుతున్న మొక్కజొన్నపంటను పరిశీలిస్తున్న జిల్లావ్యవసాయాధికారి శ్రీనివాసరావు, తహసీల్ధార్‌ రమణారావు

పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు

తాళ్లూరు, నవంబరు 30(ఆంధ్ర జ్యోతి): దిత్వా తుఫాన్‌ ప్రభావంతో కోతకు వచ్చిన పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాఽధికారి ఎస్‌.శ్రీనివాసరావు రైతు లకు సూచించారు. ఆదివారం మండలంలోని మండలంలోని శివరాంపురం, తాళ్లూరు, కొర్రపాటివారిపాలెం, విఠలాపురం గ్రామాల్లో పంటల పరిస్థితులను పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మొంథా తుఫాన్‌ ప్రభావల్ల పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. మరలా దిత్వా తుఫాన్‌ నేపథ్యంలో కోతకు వచ్చిన పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరి, మొక్కజొన్న పంటలను కోత కోయకుండా ఆపాలన్నారు. పొలాల్లో కుప్పలుగా వున్న ధాన్యాన్ని పరదా పట్టలతో కప్పి కాపాడుకోవాలన్నారు. కోతకు వచ్చిన పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెళ్లగొట్టాలన్నారు. రైతులు తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బీవీ రమణారావు, ఏవో బి.ప్రసాదరావు, వీఏఏ షేక్‌ అజ్మీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు అందుబాటులో ఉండాలి

ముండ్లమూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్‌ నేప థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ఎల్‌.లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక మం డల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దిత్వా తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలియ జేయటంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. గ్రామ స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో ఉండి వాగులు పొంగి ప్రవహించే అవకాశాలు ఉన్నగ్రామాల్లో దం డోర వేసి ప్రజలను అప్రమత్తం చేయాల న్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి వరి కోతలు కోయకుండా వాయిదా వేసుకొనే విధంగా తెలపాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఎం.శ్రీదేవి, వ్యవసాయ అధికారి ఏ.తిరుమలరావు, పంచాయతీ రాజ్‌ ఏఈ ఎం.వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌. జనార్దన్‌, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 10:37 PM