Share News

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:28 PM

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండా లని జిల్లా మలేరియా అధికారి ఎన్‌. మధుసూదన్‌రావు అన్నారు.

స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారి మధుసూదన్‌రావు

జిల్లా మలేరియా అధికారి మధుసూదన్‌రావు

కనిగిరి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): స్క్రబ్‌టైఫస్‌పై అప్రమత్తంగా ఉండా లని జిల్లా మలేరియా అధికారి ఎన్‌. మధుసూదన్‌రావు అన్నారు. పట్టణం లోని గురుకల పాఠశాలలో గురువారం విద్యార్థినులకు స్క్రబ్‌టైఫస్‌పై డాక్టర్‌ సృజన అధ్యక్షతన అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. మధుసూదన్‌రావు మాట్లాడుతూ ఇది ఒరిఎన్టీయా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధి అని అన్నారు. ఒక్క సారిగా ఆకస్మికంగా జ్వరం వస్తుందని చెప్పారు. ఈబ్యాక్టీరియా మనుషులకు చిన్నఎర్రటి పురుగులు, వాటి లార్వా, కొండీల కాటుతో వస్తుందన్నారు. ఎక్కువగా ఈపురుగులు దట్టమైన చెట్లు, పొదలు, పశువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయ న్నారు. సాధారణంగా చలి, వర్షాకాలంలో ఎక్కువగా ఉంటూ శరీరంపై చేరి కాటు వేస్తాయని తెలిపారు. ఈకాటుతో బ్యాక్టీరియా రక్తంలోకి చేరకుని వారం నుంచి 20రోజుల్లో జ్వరం వచ్చే అవకాశం ఉందన్నారు. శరీరం అంతా నొప్పులతో, చర్మంపై విపరీతమైన ఎర్రటి దద్దుర్లు, శ్వాస ఇబ్బందులతో పాటు పెదాలు ఎక్కువగా ఉబ్చి దగ్గు విపరీతంగా వస్తుందన్నారు. ఛాతీ నుంచి కింది వరకు ఈవ్యాధి సోకి మనిషిని ప్రాణాంతకంగా మారుస్తుందని తెలిపారు.

చికిత్స కోసం డాక్సిసైక్లింగ్‌ లేదా అజిత్రోమైసిన్‌ టాబ్లెట్లు వాడాలని మధుసూదన్‌రావు సూచించారు. అప్పటికి జ్వరం అదుపులోకి రాకపోతే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో మలేరియా సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ జి.శాంతి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:28 PM