జ్వరాలతో జర జాగ్రత్త
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:54 AM
చీరాల నియోజక వర్గానికి జ్వరం భయం పట్టుకుంది. గత కొద్ది రోజులుగా సుమారు నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి.
చీరాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : చీరాల నియోజక వర్గానికి జ్వరం భయం పట్టుకుంది. గత కొద్ది రోజులుగా సుమారు నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక టైఫాయిడ్, వైరల్‌ఫీవర్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో చీరాల ఏరియా వైద్యశాలలో రోజు వారీ ఓపీల సంఖ్య సైతం పెరుగుతోంది. ఇటీవల ఇతర జిల్లాల్లో డెంగీ మరణాలు కూడా చోటు చేసుకుంటుండడంతో ప్రజలు భయాందోళన చెందు తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో కోర్టు వివాదాల కారణంగా పంచాయతీ ఎన్నికలు జరుగలేదు. ఈ క్రమంలో నిధుల్లేక గ్రామాలు అధ్వానంగా ఉంటు న్నాయి. జీతాలు అందకపోవడంతో పారిశుధ్య కార్మి కులు అంతంత మాత్రంగానే విధుల్లోకి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో శానిటేషన్ పూర్తిగా మూలన పడింది. రెండు రోజులుగా జిల్లా యంత్రాగం జోక్యంతో కొంత మేరకు పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. ఈక్రమంలోనే శనివారం ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్‌గా గోపీకృష్ణ చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెంలో ఎంపీడీవో శివన్నారాయణ, ఈవోఆర్డీ రామకృష్ణ ఆధ్వర్యంలో పారిశుధ్యంపై ప్రత్యేకడ్రైవ్ నిర్వహించారు. చెత్తసేకరణతో పాటు రహదారుల్లోని మురుగు నీటి నిల్వల ప్రాంతాల్లో బ్లీచింగ్ చేయించారు. మరోవైపు ఫీవర్ సర్వేపై ఆరా కూడా తీస్తున్నారు. అయితే మున్సిపాలి టీల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో చెత్తా చెదారం, వ్యర్ధ జలాలు పెరిగి పోయాయి. ఈ క్రమంలో అఽధికారులు ప్రజల ఆరోగ్యరీత్యా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
పారిశుధ్యాన్ని మెరుగు పరచాలి
సంతమాగులూరు : పాతమాగులూరు గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహణ మెరుగు పరచాలని జిల్లా పరిషత్ ఒంగోలు డిప్యూటీ సీఈవో, అద్దంకి నియోజకవర్గ ప్రత్యేక అధికారి బాలమ్మ అధికారులకు సూచించారు. శనివారం పాత మాగులూరు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో పారి శుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాలనీలలో ఇంటింటికి వెళ్లి డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి జిర్రా విజయ్‌బాబు, ఎంపీడీవో జ్యోతిర్మయి, ఈవోపీఆర్‌డీ శివరాం ప్రసాద్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేశాం
బల్లికురవ : సీజనల్ వ్యాధులు రాకుండా సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని నక్కబొక్కలపాడు గ్రామంలో దోమల నివారణకు గ్రామ పంచాయతీ చేపడుతున్న ఫాగింగ్‌ను అయన పరిశీలిం చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామాలలో రోడ్ల వెంబడి చెత్త, మురుగు లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. డెంగ్యూ జ్వరా లు రాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో పాండురంగస్వామి, పంచాయతీ కార్యదర్శి షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు.
అద్దంకిటౌన్ : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో బత్తిన సింగయ్య అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అవిశన జ్యోతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాలల్లో మురుగు కాలువలు శుభ్రపరచడంతో పాటు మురుగు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోలన్నారు. అవరమైన ప్రాంతాలల్లో బ్లీచింగ్ చల్లాలని, అయిల్ బాల్స్ వంటివి వేయాలని సూచించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ పథకాలు, అమలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జ్వరాల సర్వేపై నిర్లక్ష్యం వద్దు
అద్దంకిటౌన్ : గ్రామంలో పంచాయతీ, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, డ్రైడే, జ్వరాల సర్వేపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో బత్తిన సింగయ్య అన్నారు. శనివారం మండలంలోని గోపాలపురం గ్రామంలో డ్రైడే, జ్వరాల సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌వీఎస్ ప్రసాదరావు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పంగులూరు : విషజ్వరాలు ప్రబలకుండా సంబందిత శాఖాధికారులు గ్రామాలలో తక్షణ చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేకాధికారి అనంతరాజు అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని బూదవాడ, కల్లంవారిపాలెం, చినమల్లవరం గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నీటి నిల్వ ఉన్నచోట ఆయిల్‌బాల్స్ వేయించి ఎబేట్ స్ర్పే చేయించారు. బూదవాడ, రామకూరు గ్రామాలలో దోమల బెడద నివారించేందుకు శనివారం పూర్తిస్థాయిలో ఫాగింగ్ చేయించినట్లు ఇన్‌చార్జ్ ఎంపీడీవో సుమంత్ తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి వైద్యాధికారి డాక్టర్ శివచెన్నయ్య, ఆర్.డబ్ల్యూఎస్ ఏఈ శివయ్య, కార్యదర్శి రాంబాబు, పంచాయితీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు స్థానిక నేతలు పాల్గొన్నారు.