ఆధారాల్లేని ఆరోపణలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:49 AM
ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రిసోర్స్‌పర్సన్స్ (ఆర్పీల)పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మోతుకూరి రామ్‌చౌదరిపైకేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్పీల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని ఆర్పీలు, మెప్మా ఉద్యోగులు శనివారం డీఎీస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అనుచిత పోస్టింగ్‌లు
కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆర్పీలు
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న రిసోర్స్‌పర్సన్స్ (ఆర్పీల)పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మోతుకూరి రామ్‌చౌదరిపైకేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్పీల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని ఆర్పీలు, మెప్మా ఉద్యోగులు శనివారం డీఎీస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు ఎన్.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్పీలు నిరంతరం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అయితే ఒంగోలుకు చెందిన రామ్‌చౌదరి సోషల్ మీడియాలో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా అనుచిత పోస్టులు పెట్టడం మనోభావాలను దెబ్బతీశాయని ఆమె వాపోయారు. ఇష్టానుసారం పోస్టింగ్‌లు పెట్టడం వలన అనేక మందికి కుటుంబాల్లో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నా యన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా పోస్టింగ్‌ల ద్వారా ఓ ఆర్పీ.. భర్త చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుం డా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. ఇదేవిషయమై ఆర్పీలు డ్వామా పీడీ పి.శ్రీహరికి కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు మెప్మా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్.రాహేలమ్మ, జె.నయోమి, డి. దేవయాని, కార్యాలయ సిబ్బంది ఫణికుమారి, సీఎంఎం సంతోష్, బ్యాంక్ లింకేజ్ స్పెషలిస్ట్ రాణి, సీవోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.