లాటరీ పద్ధతిన బార్లు
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:41 AM
నిబంధనల ప్రకారం నాలుగు ఆపైన దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ నిర్వహించారు. ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశం మందిరంలో శనివారం జరిగిన లాటరీ ప్రక్రియలో డీఆర్వో ఓబులేశు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ విజయ, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం పాల్గొన్నారు.
26కుగాను 18కే ప్రక్రియ
గీత కార్మికులకు మూడు
ఐదింటికి తిరిగి నోటిఫికేషన్
ఒంగోలు క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం నాలుగు ఆపైన దరఖాస్తులు వచ్చిన బార్లకు లాటరీ నిర్వహించారు. ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశం మందిరంలో శనివారం జరిగిన లాటరీ ప్రక్రియలో డీఆర్వో ఓబులేశు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ విజయ, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం పాల్గొన్నారు. వారి సమక్షంలో ఒంగోలులో 11, మార్కాపురంలో 2, చీమకుర్తి, దర్శి, పొదిలి, కనిగిరి, గిద్దలూరులో ఒక్కో బార్‌కు లాటరీ తీసి ఎంపికైన వారికి కేటాయించారు. మొత్తం 78 అప్లికేషన్లు రాగా 18 బార్లకు లాటరీ తీశారు. అదేవిధంగా గీత కార్మి కులకు కేటాయించిన ఒంగోలు బార్‌కు 6 దరఖాస్తులు, మార్కాపురంలో బార్లకు 8 అప్లికేషన్లు అందాయి. వాటిలో ముగ్గురికి మాత్రమే బార్లు దక్కాయి. ఇంకా ఎనిమిది బార్లు మిగిలిపోయాయి. వీటిలో అసలు దరఖాస్తులు రాని బార్లను వదిలివేసి, 1 నుంచి 3లోపు అప్లికేషన్లు వచ్చిన ఐదు బార్లకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో ఒంగోలులో 3, మార్కాపురంలో 2 బార్లు ఉన్నాయి. వచేనెల 1 వరకు దరఖాస్తులు ఆహ్వానించి 2న తిరిగి లాటరీ తీయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషాబేగం తెలిపారు.