Share News

బార్‌.. వద్దు బాబోయ్‌!

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:38 AM

బార్‌ల నిర్వహణకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దరఖాస్తు గడువు పెంచినా ప్రయోజనం కనిపించ లేదు. జిల్లాలో 26 బార్లు ఉండగా 17కు మాత్రమే 4 దరఖాస్తుల చొప్పున దాఖలయ్యాయి. ఒంగోలులో మొత్తం 16 బార్లు ఉండగా 11కు మాత్రమే లాటరీకి అర్హత లభించింది. వీటికి నాలుగు చొప్పున అప్లికేషన్లు వచ్చాయి.

బార్‌.. వద్దు బాబోయ్‌!

వెనక్కి తగ్గిన దరఖాస్తుదారులు

26కుగాను 17కు మాత్రమే అర్హత

మొత్తం 78 దరఖాస్తులు రాక

దర్శి బార్‌కు రెండే!

ఒంగోలు క్రైం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : బార్‌ల నిర్వహణకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దరఖాస్తు గడువు పెంచినా ప్రయోజనం కనిపించ లేదు. జిల్లాలో 26 బార్లు ఉండగా 17కు మాత్రమే 4 దరఖాస్తుల చొప్పున దాఖలయ్యాయి. ఒంగోలులో మొత్తం 16 బార్లు ఉండగా 11కు మాత్రమే లాటరీకి అర్హత లభించింది. వీటికి నాలుగు చొప్పున అప్లికేషన్లు వచ్చాయి. మార్కాపురంలో 5 బార్లు ఉండగా రెండుకు మాత్రమే లాటరీ అర్హత వచ్చింది. గిద్దలూరు, చీమకుర్తి, కనిగిరి, పొదిలిలో ఒక్కో బార్‌కు నాలుగేసి అప్లికేషన్లు వచ్చాయి. దీంతో వాటికి లాటరీ వేయనున్నారు. దర్శికి కేటాయించిన బార్‌కు కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే అందాయి. ఈ కారణంగా దానికి లాటరీని నిలిపి వేస్తారు. శనివారం జరిగే లాటరీలో 16 బార్లకు మాత్రమే లాటరీ వేయనున్నారు. మొత్తం 26 బార్లకు 78 దరఖాస్తులు అందాయి. నాలుగు అప్లికేషన్లు రాని బార్‌కు లాటరీ వేయరు. వ్యాపారులు చెల్లించిన దరఖాస్తు ఫీజు తిరిగి ఇస్తారు.

Updated Date - Aug 30 , 2025 | 02:38 AM