ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:09 AM
ఎట్టకేలకు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మంగళవారం ముగిశాయి. ఎన్నికల అధికారిగా రవి కుమార్‌రెడ్డి వ్యవహరించగా ఉదయం నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం 201 ఓట్లకు గాను 190 పోలయ్యాయి.

మూడవ సారి అధ్యక్షునిగా రమే్‌షబాబు
స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన
సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు
చీరాల, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మంగళవారం ముగిశాయి. ఎన్నికల అధికారిగా రవి కుమార్‌రెడ్డి వ్యవహరించగా ఉదయం నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం 201 ఓట్లకు గాను 190 పోలయ్యాయి. సాయంత్రం ప్రారంభమైన కౌంటింగ్ ఒక దశలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు సీనియర్ న్యాయవాది కొమ్మనబోయిన నాగేశ్వరరావుకు 91 ఓట్లు దక్కగా, 97 ఓట్లు సాధించి 6 ఓట్ల మెజారిటీతో మూడవ సారి కూడా గౌరవ రమే్‌షబాబు విజయాన్ని అందుకున్నారు. ఒక ఓటు నోటా కాగా, ఉపాధ్యాక్షుడిగా విజయకుమార్, జనరల్ సెక్రటరీగా రవికుమార్, ట్రెజరరీగా రామ కోటేశ్వరరావు, లైౖబ్రరీగా కామేశ్వరరావు ఎన్నికయ్యారు. కల్చరర్ సెక్రటరీగా రాజా సాల్మన్, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ మస్తాన్‌వలి, మహిళా ప్రతినిధిగా స్నేహ మాత్రమే వేయడంతో ఆ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికైన వారిని సహచర న్యాయవాదులు అభినందించారు.