సమస్యలు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:06 PM
బ్యాంకు ఉద్యోగుల ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాల డిమాండ్‌తో మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో స్థానిక నెల్లూరు బస్టాండులోని యూనియన్ బ్యాంకు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకు ఉద్యోగుల ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాల డిమాండ్‌తో మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో స్థానిక నెల్లూరు బస్టాండులోని యూనియన్ బ్యాంకు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూఎ్‌ఫబీయూ కన్వీనర్ కే రాజీవ్ రతన్‌దేవ్ మాట్లాడుతూ పదో ద్వైపాక్షిక ఒప్పందంలో వారానికి ఐదురోజుల పనిదినాలు ఉండే విధంగా అంగీకరించారన్నారు. 2వ, 4వ శనివారాలను సెలవులు దినాలుగా ప్రకటించి రానున్న రోజుల్లో మిగిలిన శనివారాలను కూడా సెలవులుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఇంత వరకు అమలు చేయలేదని చెప్పారు. వెంటనే ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు పీ సుబ్బారావు, ఉమాశంకర్, కిషోర్‌రెడ్డి, శ్రీధర్, ఎం. ఏడుకొండలు పాల్గొన్నారు.