నల్లబర్లీ సాగుపై నిషేధం
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:16 PM
: ప్రస్తుత ర బీ సీజన్ నుంచి మండలంలో నల్లబర్లీ పొగాకు సా గుపై ప్రభుత్వం నిషేధం విధించిందని వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా అన్నారు. మండలంలోని అనుములవీడు, ఒద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి గ్రామా ల్లో మంగళవారం ఆయన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ర్యాలీ ద్వా రా నల్లబర్లీ సాగు నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
రాచర్ల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత ర బీ సీజన్ నుంచి మండలంలో నల్లబర్లీ పొగాకు సా గుపై ప్రభుత్వం నిషేధం విధించిందని వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా అన్నారు. మండలంలోని అనుములవీడు, ఒద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి గ్రామా ల్లో మంగళవారం ఆయన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ర్యాలీ ద్వా రా నల్లబర్లీ సాగు నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒకవేళ ఎవరైనా సాగు చేస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదని, వేసిన పంటను కూ డా తొలగిస్తామని అన్నారు. రైతులకు నారు సప్లై చే సే ఏజెంట్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నల్లబర్లీకి బదులు మొ క్కజొన్న, ఉలవలు, జొ న్న పంటలు సాగు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు రమేష్, శ్రావణి, రైతులు పాల్గొన్నారు.
పొగాకుకు బదులు అపరాలు సాగు చేసుకోవాలి
పెద్ద దోర్నాల : ప్రభుత్వం పొగాకు సాగును నిషేధించిందని, ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని వ్వవసాయాధికారి జవహర్‌లాల్ నాయక్ అన్నారు. మండలంలోని యడవల్లి, గంటవానిపల్లె గ్రామాల్లో పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో జవహర్‌లాల్‌నాయక్ ఆయా గ్రామాల్లో సాగు చేసిన మిరపను పరిశీలించారు. వాన తాకిడి నుంచి బయటపడ్డ తోటలో తక్షణమే సస్యరక్షణ చర్యలు పాటించాలని అన్నారు. 19:19:19కేజీ మందును ఎకరాకు పంటపై పిచికారీ చేయాలన్నారు. అలాగే రబీలో సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్న భూ ముల్లో మొక్కజొన్న, అలసంద, మిను ము, పప్పు శనగ తదితర అపరాలు విత్తుకోవాలని సూచించారు. కార్యక్రమం లో వీహెచ్‌ఏ కృష్ణవేణి, ఏపీసీఎన్‌ఎ్‌ఫ సిబ్బంది పాల్గొన్నారు.
పొగాకు నియంత్రణపై అవగాహన
పొదిలి : పొగాకు పంట నియంత్రణపై రైతులకు అవగాహణ కార్యక్రమం మంగళవారం పొగాకు బో ర్డు ఆవరణలో వేలం నిర్వాహణాధికారి గిరిరాజకుమార్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల పొగాకు మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకొని అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేపట్టరాదన్నారు. బోర్డు నిర్దేశించిన మేరకు మాత్రమే పొగాకు సాగు చేయాలన్నారు. మార్కెట్ ధరలు, అంతర్జాతీయంగా పలు దేశాలలోని పొగాకు ఉత్పత్తి, నాణ్యత పలు అంశాల ఆధారంగా దేశంలో పొగాకు ధరలు ఆధారపడి ఉంటాయన్నారు. రైతులు ముఖ్యంగా నాణ్యమైన పొగాకు దిగుబడులు సాధించే లక్ష్యంగా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. పొగాకు నాణ్యతను పెంపొందించటానికి రైతులు పొటాషి ఎరువులు విధిగా వాడాలని తెలిపారు. రైతులు ముఖ్యంగా పంట సాగుకు ముందు తమ పొలాలలో జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి భూసారాన్ని పెంపొందించుకోవాల న్నారు. రైతులు పోటీతో అధిక ధరలు వెచ్చించి పొలాలు మరియు బార్నీలను లీజుకు తీసుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ, జిపిఐ మేనేజర్లు జి వెంకట్రావు, గోపిరెడ్డి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.