Share News

వైసీపీని వీడి టీడీపీలో చేరిన బాలచెన్నయ్య

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:13 PM

గిద్దలూరు పట్టణం 20వ వార్డు మాజీ కౌన్సిలర్‌ కుమారుడు పాలకవీటి బాలచెన్నయ్య వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతోపాటు అతని అనుచరులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీని వీడి టీడీపీలో చేరిన బాలచెన్నయ్య
బాలచెన్నయ్యకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు పట్టణం 20వ వార్డు మాజీ కౌన్సిలర్‌ కుమారుడు పాలకవీటి బాలచెన్నయ్య వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతోపాటు అతని అనుచరులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 20వ వార్డు మాజీ కౌన్సిలర్‌ కుమారుడు బాలచెన్నయ్య, అనుచరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రం ముందుకు సాగుతుందని, అశోక్‌రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరినట్లు బాలచెన్నయ్య తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, లొక్కు రమేష్‌, వెంకటయ్య, ఓబయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 10:13 PM