చెడు అలవాట్లను వీడాలి
ABN , Publish Date - May 03 , 2025 | 10:15 PM
ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, అలాగే చెడు అలవాట్లను విడనాడాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఏ ఓంకార్ అన్నారు. శనివారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలతో వారోత్సవాలను నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమం జరిగింది.
జూనియర్ సివిల్
న్యాయాధికారి ఓంకార్
గిద్దలూరు టౌన్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, అలాగే చెడు అలవాట్లను విడనాడాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఏ ఓంకార్ అన్నారు. శనివారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలతో వారోత్సవాలను నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయాధికారి ఓంకార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల ఫలాలను ప్రతి ఒక్క రూ అందుకోవాలన్నా రు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమన్నారు. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని, వారి అభ్యున్నతికి తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కార్డుదారులకు ఆర్థికంగా ఆదుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ఐ.శ్రీనివాసులు, మేనేజర్ బీవీ రంగారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ షేక్ ఖాదర్‌వలి, అసిస్టెంట్ ఇంజనీర్ కె.పోసియా, ప్యానల్ లాయర్ ఎం.పిచ్చయ్య, న్యాయవాది ఇ.బాలక్రిష్ణ, పారాలీగల్ వలంటీర్ అద్దంకి మధుసూదన్‌రావు పాల్గొన్నారు.