Share News

వాటర్‌షెడ్‌లో జిల్లాకు అవార్డులు

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:24 AM

జిల్లా నీటి యాజమాన్య సంస్థ పర్యవేక్షణలో ఉన్న వాటర్‌ షెడ్‌లకు సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో జిల్లాకు రెండు అవార్డులు దక్కాయి. గుంటూరులో మంగళవారం జరిగిన సదస్సులో కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ల చేతులమీదుగా డ్వామా ఏపీడీ హనుమంతరావు అవార్డులతోపాటు చెక్కులను అందుకున్నారు.

వాటర్‌షెడ్‌లో జిల్లాకు అవార్డులు
కేంద్ర మంత్రుల నుంచి చెక్కు అందుకుంటున్న డ్వామా ఏపీడీ హనుమంతరావు

గుంటూరులో కేంద్ర మంత్రుల చేతులమీదుగా అందుకున్న డ్వామా ఏపీడీ

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నీటి యాజమాన్య సంస్థ పర్యవేక్షణలో ఉన్న వాటర్‌ షెడ్‌లకు సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో జిల్లాకు రెండు అవార్డులు దక్కాయి. గుంటూరులో మంగళవారం జరిగిన సదస్సులో కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ల చేతులమీదుగా డ్వామా ఏపీడీ హనుమంతరావు అవార్డులతోపాటు చెక్కులను అందుకున్నారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెంలో మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు పర్యటన ఉండటంతో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో డ్వామా తరపున ఏపీడీ హనుమంతరావుతోపాటు పలువురు అధికారులు గుంటూరు సదస్సుకు హాజరయ్యారు. జిల్లాలోని మారెళ్ల, తువ్వపాడు వాటర్‌షెడ్లకు ఈ అవార్డులు లభించాయి.

Updated Date - Nov 12 , 2025 | 01:24 AM