Share News

పాఠశాలల్లో తనిఖీలు

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:12 AM

కేంద్ర మానవ వన రుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఏటా 20శాతం పాఠశాలల చొప్పున ఐదేళ్లలో వంద శాతం ఆడిట్‌ను పూర్తిచేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 50 పాఠశాలలను సోషల్‌ ఆడిట్‌కు ఎంపిక చేశారు.

పాఠశాలల్లో తనిఖీలు

50 స్కూళ్లలో సోషల్‌ ఆడిట్‌

ఒంగోలు విద్య, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మానవ వన రుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఏటా 20శాతం పాఠశాలల చొప్పున ఐదేళ్లలో వంద శాతం ఆడిట్‌ను పూర్తిచేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 50 పాఠశాలలను సోషల్‌ ఆడిట్‌కు ఎంపిక చేశారు. తనిఖీల కోసం 29మంది డీఆర్పీలు, ఇద్దరు ఎస్‌ఆర్వోలు కలిపి 31మందిని నియమించారు. ఈనెల 10 నుంచి సోషల్‌ ఆడిట్‌ మొదలు కావాల్సి ఉండగా ఆర్పీలు మంగళవారం నుంచి ప్రారంభించారు. మంగళ, బుధవారాల్లో 29 పాఠశాలల్లో పూర్తిచేశారు. గురు, శుక్రవారాల్లో మిగిలిన 21 స్కూళ్లలో తనిఖీలను చేయనున్నారు. సోషల్‌ ఆడిట్‌లో పుస్తకాలు, యూనిఫాం, క్రీడా పరికరాలన్నింటినీ పరిశీలించారు. ఆయా అంశాలను అప్పటికప్పుడే యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌టచ్‌పై ప్రశ్నించి వివరాలను రాబట్టారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చిక్కీలను కూడా ఆర్పీలు లెక్కించారు. అక్కడ ఉన్న స్టాక్‌ను ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. పాఠశాలల రికార్డులన్నింటిని పరిశీలించారు. ఒంగోలు నగరంలో మూడు పాఠశాలలకు సంబంధించిన సోషల్‌ అడిట్‌ బుధవారం ముగిసింది.

Updated Date - Nov 13 , 2025 | 01:12 AM