బంగారం గొలుసు అపహరణకు యత్నం
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:54 PM
అద్దంకి, పట్టణంలోని కలవకూరు రోడ్డులో వైఎ్‌సఆర్ అపార్ట్‌మెంట్ ఎదరు చిల్లరకొట్టులోని మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించేందుకు యత్నించిన యువకుడిని మహిళలు అడ్డుకున్నారు.
ఎదిరించిన మహిళలు
బంగారం గొలుసు పడవేసి పరారైన దొంగ
అద్దంకి, అక్టోబరు30(ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని కలవకూరు రోడ్డులో వైఎ్‌సఆర్ అపార్ట్‌మెంట్ ఎదరు చిల్లరకొట్టులోని మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించేందుకు యత్నించిన యువకుడిని మహిళలు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు... కలవకూరు రోడ్డులో బడ్డీ దుకాణం వద్దకు గురువా రం సాయంత్రం ఒక యువకుడు వెళ్లా డు. దుకాణదారు గురవమ్మను వాటర్ బాటిల్ అడిగాడు. ఇచ్చిన తరువాత మరో బాటిల్ అడగడంతో తీసుకొచ్చేందుకు దుకాణంలోకి వెళ్లింది. ఆ సమయంలో యువకుడు కూడా లోపలకెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును లాగాడు. ఎదురు ఎదురు తిరిగి ఆ యువకుడిని బయటకు నెట్టింది. ఈ విషయాన్ని గమనించిన సమీపంలో మహిళా బేల్దారి కూలీ వచ్చి దొంగకు చెందిన మోటార్‌సైకిల్ తాళం తీసింది. దీంతో దొంగ దుకాణంలో ఉన్న కత్తి తీసి బెదిరించాడు. దీంతో తాళం ఇచ్చా రు. బంగారం గొలుసును అక్కడే పడవేసి దొంగ మోటార్‌సైకిల్‌పై కలవకూ రు రోడ్డులో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ సుబ్బరాజు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు.