Share News

సోమవర్పాడులో బాల్యవివాహానికి యత్నం

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:15 PM

మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడులో 9వతరగతి చదువుతున్న బాలికకు జరుగుతున్న వివాహాన్ని మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్‌ ఆద్వర్యంలో అధికారులు గురువారం అడ్డుకున్నారు. తూర్పుగంగవరం జడ్పీహైస్కూల్‌ను విజిట్‌ చేస్తున్న సమయంలో ఓవిద్యార్థి అధికారుల వద్దకు వచ్చి 9వ తరగతి చదువుతున్న సోమవర్పాడు చెందిన ఎస్సీ కాలనీ బాలికకు వివాహం చేస్తున్నారని చెప్పారు.

సోమవర్పాడులో బాల్యవివాహానికి యత్నం
బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ప్రత్యేకాధికారి, ఎంపీడీవో

అడ్డుకున్న అధికారులు

తాళ్లూరు,డిసెంబరు11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడులో 9వతరగతి చదువుతున్న బాలికకు జరుగుతున్న వివాహాన్ని మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్‌ ఆద్వర్యంలో అధికారులు గురువారం అడ్డుకున్నారు. తూర్పుగంగవరం జడ్పీహైస్కూల్‌ను విజిట్‌ చేస్తున్న సమయంలో ఓవిద్యార్థి అధికారుల వద్దకు వచ్చి 9వ తరగతి చదువుతున్న సోమవర్పాడు చెందిన ఎస్సీ కాలనీ బాలికకు వివాహం చేస్తున్నారని చెప్పారు. దీంతో వెంటనే అధికారులు సోమవర్పాడు అంగన్‌వాడీకార్యకర్త,అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌, పోలీస్‌ శాఖకు ప్రత్యేకాధికారి సమాచారం ఇచ్చి గ్రామ విలేజ్‌ పోలీస్‌, వీఆర్‌వోలను వెంట బెట్టుకుని పెళ్లి పందిరి వద్దకు వెళ్లారు. పెళ్లి కుమారుడి బంధువుతో మాట్లాడారు. మైనర్‌కు వివాహం చేస్తున్నందున కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాము వివాహం చేయటం లేదని, నిశ్చయ తాంబూలం తీసుకుంటామని పెళ్లికుమారుని కుటుంబీకులు తెలిపారు. బాలిక ఇంటి వద్దకు వెళ్లి కుటుంబీకులతో పెళ్లి జరపవద్దని, అలా చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. అనంతరం బాలికకు చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే జరిగే అనర్థాల గురించి వివరించారు. ఇద్దరి కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇచ్చి మైనర్‌ తీరేవరకు బాలికకు వివాహం చేయమని ఒప్పంద పత్రం రాయించుకున్నారు. అధికారుల రంగప్రవేశంతో పెళ్లి పెద్దలు భయాందోళన చెంది పెళ్లి చేయమని అంగీకరించటంతో అధికారులు వెనుదిరిగారు. ఈకార్యక్రమంలో ఎంఈవో జి.సుబ్బయ్య, డిప్యూటీ ఎంపీడీవో నాగమల్లేశ్వరి, వీఆర్‌వోలు శివారెడ్డి, రమణారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 11:15 PM