Share News

నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:08 PM

నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కంభం రోడ్డులోని అటవీశాఖ పరిధిలోని పార్కులో ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టారు.

నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కంభం రోడ్డులోని అటవీశాఖ పరిధిలోని పార్కులో ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా హెచ్‌ఎంపాడు మండలపార్టీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్‌టీఆర్‌)తో పాటు టీడీపీ నాయకులు, శ్రేణులు పార్కులోని ముళ్ళచెట్లను, రాళ్ళకుప్పలను తొలగించే ఏర్పాట్లు చేపట్టారు. పార్కులో విరివిగా మొక్కలు నాటించేలా ఏర్పాటు చేపట్టారు. ప్రత్యేకంగా శ్రామికుల ను రప్పించి మొక్కలు నాటించే ఏర్పాట్లు చేపట్టారు. పార్కులో నిర్వహించే నూతన సంవత్సర వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. నాయకులకు, శ్రేణులకు తగు సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం కూడా పార్కులో ఆహ్లాదకర వాతావరణానికి వీలుగా తగు ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు జంషీర్‌, బాలు ఓబులురెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, హెచ్‌ఎంపాడు ఎస్‌ఐ మాధవరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:08 PM