Share News

అసెంబ్లీకి వెళ్లనివారు నీతులు చెప్పడమా..!

ABN , Publish Date - May 25 , 2025 | 10:36 PM

అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై చర్చించేందుకు భయపడుతున్న వ్యక్తులు నీతులు మాట్లాడటం వి డ్డూరంగా ఉందని మున్సిపల్‌ చై ర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ దర్శి మండల అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా ధ్వజమెత్తా రు.

అసెంబ్లీకి వెళ్లనివారు నీతులు చెప్పడమా..!
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు

టీడీపీ నేతలు ఎద్దేవా

దర్శి, మే 25(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై చర్చించేందుకు భయపడుతున్న వ్యక్తులు నీతులు మాట్లాడటం వి డ్డూరంగా ఉందని మున్సిపల్‌ చై ర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ దర్శి మండల అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా ధ్వజమెత్తా రు. ఆదివారం దర్శిలో వారు విలేకరులతో మాట్లాడు తూ వైసీపీ నాయకులు రాజకీయ ఉనికి కోసం రైతు లను అడ్డుపెట్టుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేవిధంగా చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.150 కోట్ల నష్టాన్ని భరాయిస్తామని హమీ ఇచ్చిందన్నారు. ఈనేపథ్యంలో ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అనే భయంతో పొగాకు రైతులను ఉద్దరిస్తామని వైసీపీ నాయకులు బయలు దేరటం శోచనీయమన్నారు. అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైనప్పటికీ ఇంకా వారిలో జ్ఞానోదయం కల్గలేదన్నారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో దర్శి ని యోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక స్థానిక ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడు తున్నారని అన్నారు. తాను అనుకున్నంత మంచి వాడిని కానని ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ నాయ కులు మంచివారు కారని ప్రజలు ఇప్పటికే తెలుసుకు న్నారని, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంతో సాగుతున్నాయన్నారు. గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి పథకాలను మూలనపడేసిన నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశం లో టీడీపీ దర్శి పట్టణ మాజీ అధ్యక్షుడు దారం సు బ్బారావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కె.వెలిగొండా రెడ్డి, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామయ్య, నారపుశెట్టి మధు, గొర్రె సుబ్బారెడ్డి, జూపల్లి కోటేశ్వరరావు, గుర్రం బాలకృష్ణ, కల్లూరి సుబ్బు, వెంకటనారాయణ, మాగం సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 10:36 PM