Share News

23వ తేదీ వరకు ఏపీపీఎ్‌ససీ పరీక్షలు

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:46 PM

జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు జరగనున్న ఏపీపీఎ్‌ససీ పరీక్షలకు పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేషు ఆదేశించారు.

23వ తేదీ వరకు  ఏపీపీఎ్‌ససీ పరీక్షలు
అధికారులతో మాట్లాడుతున్న డీఆర్వో చినఓబులేషు

పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్వో ఆదేశం

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు జరగనున్న ఏపీపీఎ్‌ససీ పరీక్షలకు పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేషు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో సోమవారం సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణ కోసం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 8నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1నుంచి 2 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టువద్ద ఉన్న శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, మార్కాపురంలోని డాక్టర్‌ శామ్యూల్‌ జార్జి ఇంజనీరింగ్‌ కళాశాల, ఒంగోలులోని బ్రిలియంట్‌ కంప్యూటర్‌ సంస్థ, రైజ్‌ కృష్ణసాయి, రైజ్‌ కృష్ణసాయి గాంధీ ఇంజనీరింగ్‌ కళాశాల, ఒంగోలులోని నేషనల్‌ కౌన్సిల్‌ఫర్‌ చర్చ్‌ సోషల్‌ యాక్షన్‌ ఇండియా సంస్థలో ఈపరీక్షలు జరుగుతాయన్నారు. హాల్‌ టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. సెల్‌ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ వాచీలు, పరికరాలను పరీక్షా కేంద్రాల్లో అనుమతించడం లేదన్నారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్‌ సూపరింటెండెంట్లదే కీలక బాధ్యత అని డీఆర్వో తెలిపారు. సమావేశంలో ఏపీపీఎ్‌ససీ సెక్షన్‌ ఆఫీసర్‌ విజయకుమార్‌, డీపీవో వెంకటనాయుడుతో పాటు పోలీస్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, చీఫ్‌ సూపరింటెండెంట్లు, లైజనింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:46 PM