Share News

ఉత్తమ పనితీరుకు ప్రశంస

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:31 AM

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లక్ష్యా లు పూర్తిచేసిన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రభుత్వపరంగా గుర్తింపు ఇచ్చి ప్రశంసాపత్రాలు ఇప్పటివరకు ఇస్తున్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ.. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీశ్రేణులకు, జనంతో మమే కమై క్రియాశీలకంగా పనిచేసిన వారికి అదే తరహాలో ప్రశం సాపత్రాలను ఇవ్వడంతోపాటు సత్కరిస్తోంది.

ఉత్తమ పనితీరుకు ప్రశంస
ప్రశంసాపత్రాలు పొందిన వారితో ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌, ఇతర ముఖ్యనేతలు

టీడీపీ శ్రేణులకు సత్కారాలు

నియోజకవర్గాల వారీ ప్రశంసా పత్రాలు

‘సుపరిపాలనకు ఏడాది’లో చురుగ్గా పాల్గొన్న వారికి ప్రత్యేక గుర్తింపు

ఒంగోలు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో లక్ష్యా లు పూర్తిచేసిన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రభుత్వపరంగా గుర్తింపు ఇచ్చి ప్రశంసాపత్రాలు ఇప్పటివరకు ఇస్తున్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ.. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీశ్రేణులకు, జనంతో మమే కమై క్రియాశీలకంగా పనిచేసిన వారికి అదే తరహాలో ప్రశం సాపత్రాలను ఇవ్వడంతోపాటు సత్కరిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం జిల్లాలోని వివిధ నియో జకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గుర్తింపు, సత్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేతకు ఈఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సుపరిపాలనకు ఏడాది కార్యక్రమాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జూలై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనకు ఏడాది కార్యక్రమాన్ని నిర్వహించారు. నూరుశాతం బూత్‌లలో ఈ కార్యక్రమం సాగిన యూనిట్‌, క్లస్టర్‌లను గుర్తించి వాటికి కన్వీనర్‌, ఇన్‌ చార్జిలుగా వ్యవహరించిన నాయకులకు ప్రస్తుతం సత్కారాలు చేసి ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.

నియోజకవర్గాలలో కార్యక్రమాలు

ప్రస్తుతం ప్రశంసాపత్రాలను ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందజేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో వివిధ స్థాయిల్లోని 114 మందికి ప్రశంసాపత్రాలు రాగా సోమవారం అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అందజేసి వారిని సత్కరించారు. సంతనూతల పాడు నియోజకవర్గంలో ఎంపికైన 32 మందికి మంగళవారం ఎమ్మెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌ ఒంగోలులోని తన కార్యాలయంలో అందజేశారు. వైపాలెం నియోజకవర్గం నుంచి ఎంపికైన 46 మందికి ఎర్రగొండపాలెంలో జరిగిన కార్యక్ర మంలో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అందజేశారు. మిగిలిన నియోజకవర్గా ల్లోనూ రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమా లను నిర్వహించనున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:31 AM