శింగరకొండ దేవాలయం ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకం
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:43 PM
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ట్రస్ట్‌బోర్డు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చైర్మన్‌గా మురళీసుధాకరరావు ఎన్నిక లాంఛనమే
అద్దంకి, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ట్రస్ట్‌బోర్డు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన దేవాలయాలలో ఒకటిగా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ట్రస్ట్‌బోర్డు నియామకంపై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో అద్దంకి పట్టణంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చుండూరి మురళీసుధాకరరావుకు చైర్మన్‌గా దక్కే అవకాశం ఉందని టీడీపీ వర్గీయులలో చర్చ సాగింది. అదేవిధంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సభ్యుల జాబితాలో చుండూరి మురళీసుధాకరరావు పేరు ఉంది. మొత్తం 11 మంది సభ్యులతో ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. మురళీసుధకారరావు, ఆకుల కోటేశ్వరమ్మ, బత్తుల చంద్రశేఖర్, నూతి లక్ష్మీప్రసాద్, మద్దా సునీత, ఏల్చూరి వెంకటనారాయణమ్మ, దూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, అరబోలు నాగమ్మ, దేవరపల్లి సురే్‌షబాబు, కోనంకి సుబ్బారావుల తోపాటు ఎక్స్ అఫిసియో సభ్యుడిగా కోట లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వ ఎక్స్ అఫిసియో సెక్రటరీ హరిజవహర్‌లాల్ బుదవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయానికి కూడా ఉత్తర్వులు అందినట్లు ఈవో, అసిస్టెంట్ కమిషనర్ తిమ్మానాయుడు తెలిపారు. 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన తరువాత మురళీసుధాకరరావును చైర్మన్‌గా ఎన్నుకోవటం లాంఛనమే కానుంది. తమ నియమాకానికి కృషి చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు మురళీసుధాకరరావు, మిగిలిన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.