Share News

పంచాయతీలను విభజించాలని దరఖాస్తులు

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:28 PM

మండలం లోని పలు పంచా యతీలను విభజించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామస్థు లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గుంటుపల్లి పం చాయతీ పరిధిలో ఉన్న తురకపల్లి, శంకరాపురం గ్రామాలను కొత్త పంచా యతీగా విభజించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

పంచాయతీలను విభజించాలని దరఖాస్తులు
పీసీపల్లి: తలకొండపాడు పంచాయతీని విభజించవద్దని వినతిపత్రం ఇస్తున్న పాలేటిపల్లి గ్రామస్థులు

పీసీపల్లి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలం లోని పలు పంచా యతీలను విభజించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామస్థు లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గుంటుపల్లి పం చాయతీ పరిధిలో ఉన్న తురకపల్లి, శంకరాపురం గ్రామాలను కొత్త పంచా యతీగా విభజించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబం ధించి పంచాయతీ తీర్మానాన్ని కూడా ఆయా గ్రామాల ప్రజలు అధి కారులకు అందజేశారు. ప్రజల విన్నపం మేరకు అధికారులు ఆ గ్రామంలో గ్రామసభను ఏర్పా టుచేసి వారి అభిప్రాయాన్ని సేకరించారు. ఎక్కువ శాతం ప్రజలు పంచాయతీ విభజనకు ఆమోదం తెలిపారు.

పెదఅలవలపాడు పంచాయతీని విభజించి వెంగళాపురం గ్రామాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకు న్నారు. పెదయిర్లపాడు పంచాయతీలోని మెట్లవారి పాలెం, కోదండ రామాపురం, దేశిరెడ్డిపల్లి గ్రామాలను విభజించి కొత్త పంచాయతీని ఏర్పా టుచేయాలని దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి గ్రామసభ నిర్వ హించారు. గ్రామసభలో మెజారిటీ ప్రజలు వి భజనకు ఆమోదం తెలిపారు.

తలకొండపాడు పంచాయతీలోని చిరుకూరివారి పల్లిని విభజించి పంచాయ తీగా ఏర్పాటుచేయాలని దరఖాస్తు చేసుకొన్నారు. పంచాయతీ కార్యదర్శి బ్రహ్మా చారి సోమవారం గ్రామసభ నిర్వహించారు. అయితే, తమ పం చాయతీని విభజించవద్దని గ్రామసభలో పాల్గొన్న ఎస్సీపాలెం, పాలేటిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు విన్నవించారు. పం చాయతీని విభజించాలని దర ఖాస్తు చేసిన చిరుకూరివా రిపల్లి ప్రజలు గ్రామసభకు హాజరుకాలేదు.

తాళ్లూరు: మండలంలోని దా రంవారిపాలెం, సోమవరప్పా డు నూతన పంచాయతీల ఏ ర్పాటుకు ఆయా గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ తీర్మానాలు, అందుకు సంబందించిన వివరాల దరఖాస్తులను సోమవారం డీపీవోకు అందజేశారు. ప్రస్తుతం మన్నేపల్లి, తూర్పుగంగవరం గ్రామ పంచాయతీలు అతి పెద్దవిగా ఉండి జనాభా అధికంగా ఉన్నారు. మన్నేపల్లి, తూర్పుగంగవరం గ్రామపంచాయతీల వద్ద సోమవారం సమావేశం ఏర్పాటుచేసి ప్రజల ఆమోదం, పంచాయతీ తీర్మానం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ జనాభా, విలేజ్‌ మ్యాప్‌లు, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శుల నివేదికలను డీపీవో కార్యాలయంలో అందజేశారు.

బొమ్మిరెడ్డిపల్లి పంచాయతీని విడగొట్టొద్దు!

కనిగిరి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రెండు శతాబ్దాలుగా ఒక కుటుంబంగా ఉన్న బొమ్మిరెడ్డిపల్లి పంచాయతీని విడగొట్టొద్దంటూ స్థానికులు పేర్కొ న్నారు. ఈమేరకు సోమవారం స్థానిక ఆర్డీవో, తహసీ ల్దార్‌ను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసం దర్భంగా వారు మాట్లాడుతూ కనిగిరి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి పంచాయతీలోని రాగిమానిపల్లి, గుండ్ల పాలెం గ్రామాలను బొమ్మిరెడ్డిపల్లి నుంచి విడగొట్టేం దుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను వెంటనే నిలిపివేయాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పా టుచేసిన గ్రామ సభను అధికారులు లోపభూయిష్టంగా నిర్వహించారని ఆరోపించారు. అధికారులు తిరిగి గ్రామసభ నిర్వహించి బొమ్మిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజల మనోభావాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Updated Date - Dec 22 , 2025 | 11:28 PM