Share News

శ్మశానం ఆక్ర మణకు యత్నించిన వారిపై చర్యలేవీ?

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:34 PM

తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో ఉన్న హిందూ దళితుల శ్మశానాన్ని ఆక్ర మించుకునేందుకు ప్రయత్నించిన, శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ స్థానిక ఎంపీడీవో కార్యలయం వద్ద, తహసీల్దార్‌ కార్యలయం వద్ద నాయుడుపల్లెలోని హిందువులు, దళితులు ధర్నా నిర్వహించారు.

శ్మశానం ఆక్ర మణకు యత్నించిన వారిపై చర్యలేవీ?
అధికారికి వినతిపత్రం అందిస్తున్న దళితులు

తర్లుపాడు, డిసెంబరు 26 (ఆంధ్రజోతి): తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో ఉన్న హిందూ దళితుల శ్మశానాన్ని ఆక్ర మించుకునేందుకు ప్రయత్నించిన, శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ స్థానిక ఎంపీడీవో కార్యలయం వద్ద, తహసీల్దార్‌ కార్యలయం వద్ద నాయుడుపల్లెలోని హిందువులు, దళితులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు అధ్యక్షత వహించిన గోదా పిచ్చయ్య, పాపిరెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్‌ 82-1లోని 1.71 సెంట్ల భూమిలో పూర్వం నుంచి నాయుడుపల్లె కాలనీకి చెందిన హిందువులు, దళితులు శ్మశానానికి ఉపయోగించుకుంటున్నారన్నారు.ఈ భూమిని నాగరాజు అనే ప్రభుత్వ ఉద్యోగి 15 రోజుల క్రితం ఆక్రమించుకునేందుకు ఎక్స్‌కవేటర్‌తో చదునుచేశారు. శ్మశానంలో ఉన్న సమాధులను కూడా ధ్వంసం చేయడంతో హిందువులు, దళితులు ఆందోళన నిర్వహించారు. ఆసమయంలో ప్రభుత్వ ఉద్యోగి బండారు నాగరాజుపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. అయినా ఇంతవరకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ కేకే కిషోర్‌ కుమార్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో చంద్రశేఖర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గడ్డం అంజమ్మ, నరసింహులు, వెంకటేష్‌, మునయ్య, నాగయ్య, మంచాల అంకమ్మ, పెద్ద పిచ్చయ్య, కాశయ్య, మంచాల శ్రీను, కృపానిధి, ఈశ్వరయ్యతో పాటు మరో 30 మంది కాలనీ వాసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:36 PM