Share News

అన్నా క్యాంటీన్‌ పనులను

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:40 PM

దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్‌ పనులను టీడీపీ నియోజకవర్గ నా యకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌ శనివారం పరిశీలించారు.

 అన్నా క్యాంటీన్‌ పనులను
అన్నా క్యాంటీన్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్‌ చైర్మన్‌ పిచ్చయ్య, తదితరులు

దర్శి, డిసెంబరు 13(ఆంధ్రజ్యో తి): దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్‌ పనులను టీడీపీ నియోజకవర్గ నా యకుడు డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌ శనివారం పరిశీలించారు. నిర్మాణం పనులు దాదాపు 90శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. త్వరలో క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు వీలుగా పనులు వేగవంతం చేయాలని నిర్వాహకు లకు సూచించారు.

గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మా ణం చేపట్టిన అన్నా క్యాంటీన్‌ 2019 లో ఎన్నికలు రావటంతో మధ్యలో నిలిచిపోయింది. అతర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ఆభవన నిర్మాణం అలాగే నిలి చిపోయింది. ప్రజాప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నా క్యాంటీన్‌ మధ్యలో నిలిచిపోయిన విష యాన్ని పలుమార్లు సీఎం చం ద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కృషితో పునఃప్రారంభానికి ప్రభుత్వం నిధులు విడుదల చే సింది. వచ్చే ఎన్టీఆర్‌ వర్ధంతికి అన్నా క్యాంటీన్‌ ప్రారంభం చేసేలా పనులు పూర్తి చేయా లని డాక్టర్‌ లలిత్‌సాగర్‌ కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ము న్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కమిషనర్‌ వై.మహే శ్వరరావు, తహసీల్దార్‌ ఎం.శ్రావ ణ్‌కుమార్‌, తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Dec 13 , 2025 | 10:41 PM