Share News

అనంతపురం సభలో సందడి

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:12 AM

తెలుగుదేశం పార్టీ బుధవారం అనంతపురంలో నిర్వహించిన సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆపార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు అంతా పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో పలువురు సందడిగా గడిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను 15 నెలల కాలంలోనే అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది.

అనంతపురం సభలో సందడి
సభా ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు అనగాని, పయ్యావులతో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సెల్ఫీ

హాజరైన ఉమ్మడి జిల్లా కీలక నేతలు

సూపర్‌ హిట్‌ సభ సక్సెస్‌

ఒంగోలు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ బుధవారం అనంతపురంలో నిర్వహించిన సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆపార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు అంతా పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో పలువురు సందడిగా గడిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను 15 నెలల కాలంలోనే అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలతో సభ విజయవంతమైంది. కాగా సీఎం చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో పాటు కూటమిలోని మూడు పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాగా అధిష్ఠానం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఇతర ముఖ్యనేతలు ఆ సభకు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు నాలుగు రోజుల ముందుగానే వెళ్లి అక్కడ సభా ఏర్పాట్లు, జన సమీక రణ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. మిగతావారు బుధవారం జరిగిన సభకు హాజరయ్యారు. ముందు కొందరు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఆ ప్రాంగణంలో తిరిగి ఇతర మంత్రులు, నాయకులతో కలిసి సందడి చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 02:12 AM