Share News

రుణం పేరుతో వృద్ధురాలికి టోకరా

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:15 PM

రుణం పేరుతో వృద్ధురాలికి టోకరా వేసిన ఘటన ఒంగోలు నగరం గొడుగుపాలెంలో జరిగింది.

రుణం పేరుతో వృద్ధురాలికి టోకరా

ఒంగోలు క్రైం, మార్చి11(ఆంధ్రజ్యోతి): రుణం పేరుతో వృద్ధురాలికి టోకరా వేసిన ఘటన ఒంగోలు నగరం గొడుగుపాలెంలో జరిగింది. వివరాలలోకి వెళితే.. ఇరువురు వ్యక్తులు వృద్ధురాలు అయినా బత్తిన అంకమ్మ ఇంటికి వెళ్లారు. తాము ఓ పార్టీ తరపున రూ.20 వేలు రుణం ఇస్తున్నామని, మొన్న వస్తే ఇంటిలో లేరు అని చెప్పారు. అందుకు సంబంధించిన రేషన్‌కార్డు, ఆధార్‌జిరాక్స్‌ కాపీలు ఇవ్వడంతో పాటు పసుపు రంగు చీర కట్టుకొని రూ.10వేలు చేతులలో పట్టుకొని ఫొటో దిగాలని సూచించారు. ఈ ఫొటో పైకి పంపించగానే కొద్ది సేపటికి మీ ఇంటికి ఓ మేడం వచ్చి రూ.20వేలు ఇస్తారని నమ్మించారు. అదే సమయంలో అక్కడ ఉన్న అంకమ్మ సోదరుడిని జిరాక్స్‌ కాపీలు తెమ్మని పంపించారు. ఈలోపు ఇంట్లో ఉన్న రూ.14వేలు తీసి అంకమ్మ టేబుల్‌పై పెట్టి ఇంటిలోకి వెళ్లింది. దీంతో ఆ నగదును ఇరువురు వ్యక్తులు తీసుకొని పరారీ అయ్యారని మంగళవారం వన్‌టౌన్‌ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Updated Date - Mar 11 , 2025 | 11:15 PM