అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:09 PM
అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం పేకాట, కోడిపందేలు, బైక్ రేసులు, మట్కా స్థావరాలపై ఎస్పీ వి.హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిచాయి.
డ్రోన్ కెమెరాలతో పేకాట కేంద్రాలపై దాడి
16 ప్రాంతాలలో దాడులు నిర్వహిచి రూ.1,35,800 స్వాధీనం
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం పేకాట, కోడిపందేలు, బైక్ రేసులు, మట్కా స్థావరాలపై ఎస్పీ వి.హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిచాయి. డ్రోన్ కెమెరాలతో పేకాట స్థావరాలను కనుగొన్నారు. మొత్తం 16 ప్రాంతాలలో దాడులు నిర్వహించి 80 మంది జూదరులను అరెస్టు చేశారు. పేకాటరాయుళ్ల వద్ద నుంచి రూ.1,35,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు తాలుకా -2, చీమకుర్తి-1, మద్దిపాడు-1, పొదిలి-1, తర్లుపాడు -1, త్రిపురాంతకం-1, కొండపి-1 గిద్దలూరు -1, రాచర్ల-1 కొమరోలు -1 కంభం-2, అర్ధవీడు-1, యర్రగొండపాలెం -2 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై 74 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 112, 9121102266 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.