చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:35 PM
చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. తొలి అడుగు ఏడాది సుపరి పాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర స్వగ్రామమైన హెచ్‌ఎంపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని ఆదివారం ప్యటించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. తొలి అడుగు ఏడాది సుపరి పాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర స్వగ్రామమైన హెచ్‌ఎంపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని ఆదివారం ప్యటించారు. తన నివాసం నుంచి ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సేకరించారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అ మలు, కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. కనిగిరిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సేకరించారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తె లుసుకుని నమోదు చేసుకున్నారు. ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అం దించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా టీడీపీ గ్రామ అధ్యక్షుడు, మండల అధ్యక్షుల దృష్టికి తీసుకు రావాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని హను మంతునిపాడులో నిర్మాణంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ ఖాజావలి, ఎస్‌ఐ మాధవరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్‌టీఆర్), గాయం తిరుపతిరెడ్డి, కుందురు నారాయణరెడ్డి, దశరఽథ, తదితరులు పాల్గొన్నారు.