మొంథాపై అప్రమత్తం
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:09 PM
మొంథా తుఫాన్ నేపథ్యంలో గిద్దలూరు ప్రాంతం మీదుగా వెళ్లే సగిలేరువాగు పరిస్థితిని అధికారులు సోమవారం పరిశీలించారు. మొంథా తుఫాన్ ప్రత్యేక అధికారి అబ్దుల్ రహీం, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, ఎంపీడీవో సీతారామయ్య, పంచాయతీరాజ్ ఏఈ సూరె సుబ్బారావు, వీఆర్‌వో వై.పి.రంగయ్య, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వీఆర్‌ఏలు, పోలీసులు దిగువమెట్ట తాండా వ ద్ద గల సగిలేరువాగును పరిశీలించారు.
సగిలేరును పరిశీలించిన అధికారులు
గిద్దలూరు టౌన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో గిద్దలూరు ప్రాంతం మీదుగా వెళ్లే సగిలేరువాగు పరిస్థితిని అధికారులు సోమవారం పరిశీలించారు. మొంథా తుఫాన్ ప్రత్యేక అధికారి అబ్దుల్ రహీం, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, ఎంపీడీవో సీతారామయ్య, పంచాయతీరాజ్ ఏఈ సూరె సుబ్బారావు, వీఆర్‌వో వై.పి.రంగయ్య, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వీఆర్‌ఏలు, పోలీసులు దిగువమెట్ట తాండా వ ద్ద గల సగిలేరువాగును పరిశీలించారు. అలాగే కొండపేట వద్ద గల కతువ, భీమలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద సగిలేరువాగును వారు పరిశీలించారు. వాగులోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పెద్ద దోర్నాల : మొంథా తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగాఉండాలని మండల ప్రత్యేక అధికార శ్రీనివాస ప్రసాద్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీనివాస ప్రసాద్ మా ట్లాడుతూ ఆయా శాఖల అధికారులు రానున్న విపత్ నుంచి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలతో మమేకమై వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా చెరువులు, కాలువలు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండాతగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో నాస ర్‌రెడ్డి, ఎస్సై మహేశ్, విద్యుత్ శాఖ ఏఈ భీమానాయక్, ఏవో జవహర్ లాల్ నాయక్, ఎంఈవో మస్తాన్ నాయక్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
రాచర్ల : అధికారులందరం అప్రమత్తంగా ఉండి మొంథా తుఫాన్ ముప్పు ను ఎదుర్కొందామని ప్రత్యేకాధికారి (డీటీడబ్ల్యూవో) వరలక్ష్మి అన్నారు. ఎం పీడీవో కార్యాలయంలో సోమవారం ఆ మె అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలన్నారు. అధికారులు గ్రామా ల్లో అందుబాటులో ఉండాలన్నారు. స మావేశంలో తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వెంకట రామిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేష్, ఎంఈవోలు షేక్ మొయినుద్దీన్, గిరిధర్‌శర్మ, ఏవో షేక్ మహబూబ్ బాషా, అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు తీసుకోవాలి
మార్కాపురం : మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బీవీఎస్ నారాయణరావు సూచించారు. మున్సిపాలిటీ కమిషనర్ చాంబర్‌లో సోమవారం పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలన్నారు. ఆయా గృహాలకు ఎలాంటి ప్రమాదం జరిగినా అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించేందుకు సమీపాల్లోని పాఠశాలలకు చెందిన తరగతి గదులు గుర్తించాలన్నారు. మంచి నీటి సరఫరాపై ఇంజనీరింగ్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలన్నారు. వర్షాల అనంతరం పలు రకాల వ్యాధులు ప్రబ లే ప్రమాదం ఉన్నందున వాటిపై జాగ్రత్తవహించాలన్నారు. మురుగు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా శానిటరీ విభాగం పనిచేయాలన్నారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వచ్చే సమాచారాన్నిబట్టి సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు. ఎలాంటి చిన్నపాటి సమస్యవున్నా ఉదయం 6.00 గంటల నుంచి మఽధ్యా హ్నం 2.00 గంటల వరకు 9966339599, మధ్యా హ్నం 2.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు 8474009441, రాత్రి 10 నుంచి ఉదయం 6.00 గంటల వరకు 9966622515 నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సమావేశంలో ఇంజనీరింగ్, రెవిన్యూ, శానిటరీ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.