పత్తి సాగుకు ప్రతికూల పరిస్థితులు
ABN , Publish Date - May 27 , 2025 | 11:23 PM
పత్తి సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.అకాల వ ర్షం కారణంగా రోజూ కురుస్తున్న మోస్తరు జల్లు లు మండలంలో సాగు చేసిన వేసవి పత్తి ఎదుగుదలకు ప్రతిబంధకాలుగా మారాయి. ప్రధానంగా కలుపు పైరుతో పాటు పెరుగుతోంది. నాటిన పత్తి విత్తనాలు సరిగ్గా మొలవడం లేదు.
కలుపు మొక్కలకు
అనుకూలంగా వాతావరణం
ఎదుగుదల లోపం
తగ్గిన మొలక శాతం
పెద్ద దోర్నాల, మే 27 (ఆంధ్రజ్యోతి) : పత్తి సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.అకాల వ ర్షం కారణంగా రోజూ కురుస్తున్న మోస్తరు జల్లు లు మండలంలో సాగు చేసిన వేసవి పత్తి ఎదుగుదలకు ప్రతిబంధకాలుగా మారాయి. ప్రధానంగా కలుపు పైరుతో పాటు పెరుగుతోంది. నాటిన పత్తి విత్తనాలు సరిగ్గా మొలవడం లేదు. మొలిచినా అవి ఆరోగ్యంగా ఎదగలేకపోతున్నాయి. ఒకసారి నాటిన విత్తనాలు ఒకే సారి మొలవడం లేదు సరికదా మొలిచిన మొక్కలు ఆకులు పచ్చగా మారిముడుచుకు పోతున్నాయి. మరి కొన్ని విత్తనాలు వాన నీటికి కొట్టుకుని పోవడం. ఇంకొన్ని విత్తనాలపై మట్టి చేరుకోవడంతో అవి భూమిలోపలే ఉండి పోతున్నాయి. దీంతో పైరు సక్రమంగా కనిపించడం లేదు. మళ్లీ మళ్లీ నాటాల్సి వస్తోంది. ఈ లోపు వాతావరణం చల్లగా ఉండడంతో పాటు అప్పుడప్పుడు కురుస్తున్న జల్లులకు తేమ శాతం ఎక్కువై కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పైరు ఎదుగుదలకు అవాంతరంగా మారుతున్నాయి. బురద పదునుకు అంతర సేద్యం, కలుపుతీతలు వీలుపడక పత్తి రైతులు అవేదన వ్యక్తం చేస్త్తున్నారు. మరి కొన్ని రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంపై బెంబేలెత్తి పోతున్నారు. యూరియా వంటి ఎరువులు ఏమైనా చల్లుదామంటే కలుపు పెంచిన వారమవుతామని భయపడుతున్నారు. మండలంలో సుమారు 500 ఎకరాల్లో ఏప్రిల్ చివరి రోజుల్లో, మే మొదటి వారంలో పత్తి విత్తారు. వివిధ దశల సాగులో ఉన్న పత్తి పైరుకు నాటిన మొదటి రోజుల్లో బోరుబావుల్లో నీరు లభ్యత తగ్గి పత్తికి నీటితడులు ఇచ్చేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో అకాల వర్షం కురవడం సంతోషాన్నిచ్చింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రోజూ కురుస్తున్న నా న్పుడు వానకు పైరుకు నష్టం ఏర్పడుతుండడంతో నెల రోజుల కష్టం, సొమ్ము వృథా అవుతుందేమోనని బాధ పడుతున్నారు. వాగులు వంకలు, చెరువులు, కుంటలు నిండే విధంగా పెద్దగా వాన కురిసి పోతే బాగుండునని పత్తి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.