క్షేత్రస్థాయి వ్యవసాయ అనుబంధ సిబ్బంది సర్దుబాటు
ABN , Publish Date - May 04 , 2025 | 01:27 AM
సచివాలయ పునర్‌వ్యవస్థీకరణ నేప థ్యంలో వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది నియామ కాలపై సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నియామకాలు జరిగి ఉండటంతో ఆవిధంగానే ప్రస్తుతం సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో వ్యవసాయ, ఉద్యాన, సెరీకల్చర్ శాఖలు సంయుక్తంగా ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది.
సచివాలయం యూనిట్‌గా నియామకంపై కసరత్తు
ఒంగోలులో మూడు జిల్లాల అధికారుల భేటీ
ఒంగోలు మే 3 (ఆంధ్రజ్యోతి): సచివాలయ పునర్‌వ్యవస్థీకరణ నేప థ్యంలో వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది నియామ కాలపై సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నియామకాలు జరిగి ఉండటంతో ఆవిధంగానే ప్రస్తుతం సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో వ్యవసాయ, ఉద్యాన, సెరీకల్చర్ శాఖలు సంయుక్తంగా ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. సచివాలయం యూనిట్‌గా తీసుకొని ఆ పరిధిలో ఏ పంట సాగు అధికంగా ఉంటుందో ఆ శాఖ (అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్) సిబ్బంది అక్కడ ఉండేలా నియమించనున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఒంగోలులోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందిన వ్యవ సాయ, ఉద్యాన, సెరీకల్చర్ అధికారుల సంయుక్త సమావేశం జరిగింది. జిల్లా నుంచి వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాసరావు, హార్టికల్చర్ ఏడీ గోపీచంద్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ బ్రహ్మయ్యలతోపాటు పొరుగు జిల్లాల ద్వితీయశ్రేణి అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 2024-25 సాగు సమయంలో ఖరీఫ్, రబీ సీజన్లలో ఈ క్రాప్ నమోదు ప్రకారం అధిక విస్తీర్ణం ఏపంట సాగైందో చూసి సచివాలయాల సంఖ్య ప్రకారం సగటున ఒక్కో దాని పరిధిలో ఎంత విస్తీర్ణం వస్తుందన్నది గుర్తిస్తున్నారు. అందులో ఏ శాఖ విస్తీర్ణం అధికంగా ఉంటే ఆ శాఖకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించ నున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో సుమారు ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణం ఈ క్రాప్ నమోదైంది. వ్యవసాయ, ఉద్యా న, సెరీకల్చర్ శాఖల పరిధిలో పంటలు సాగయ్యాయి. మొత్తం 906 రైతు సేవా కేంద్రాలు(సచివాలయానికి ఒకటి) ఉమ్మడి జిల్లాలో ఉండగా మూడు శాఖల పరిధిలో 871 మంది సిబ్బంది ఉన్నారు. వారిని మార్గద ర్శకాలకు అనుగుణంగా ఆయా సచివాలయాల్లో నియమించనున్నారు. కొన్నింటిలో సగటు విస్తీర్ణం కన్నా అధికంగా ఉంటే గతంలో ఆయా శాఖల్లో ఉన్న ఎంపీఈవోలను వాటికి బాధ్యులుగా నియమిస్తారు. రెండు రోజుల్లో ఈ కసరత్తు పూర్తవుతుందని డీఏవో శ్రీనివాసరావు తెలిపారు.