Share News

పునరుద్ధరణకు కార్యాచరణ

ABN , Publish Date - Nov 19 , 2025 | 01:30 AM

ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి కదలిక కనిపిస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణపై పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మురళీధర్‌ మంగళవారం సాయంత్రం డెయిరీని సందర్శించారు.

పునరుద్ధరణకు కార్యాచరణ
డెయిరీని పరిశీలిస్తున్న ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ మురళీధర్‌

ఒంగోలు డెయిరీని సందర్శించిన పాడి సమాఖ్య ఎండీ మురళీధర్‌

పాలపొడి ఫ్యాక్టరీ, యంత్రాల పరిశీలన

స్థానిక అధికారులతో సమీక్ష

గతంలో పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి కదలిక కనిపిస్తోంది. అందుకు అవసరమైన కార్యాచరణపై పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మురళీధర్‌ మంగళవారం సాయంత్రం డెయిరీని సందర్శించారు. సంస్థ ప్రాంగణాన్ని, పాలపొడి ఫ్యాక్టరీ, ఇతర విభాగాలలో ఉన్న మిషనరీని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా డెయిరీ పునరుద్ధరణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నివేదించాలని వారిని ఆదేశించారు.

ఒంగోలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాకు తలమానికంగా ఉన్న ఒంగోలు డెయిరీకి గత వైసీపీ ప్రభుత్వం సమాధి కట్టింది. ఆస్తులను ఆమూల్‌ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. వైసీపీ నిర్వా కం వల్ల డెయిరీ మూతపడగా, అమూల్‌ సేవలు జిల్లా రైతులకు ఉపకరించలేదు. కాగా గత ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు యువగళం పాదయాత్రలోనూ జిల్లా రైతుల కోరిక మేరకు డెయిరీ పున రుద్ధరణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్‌ హామీ ఇచ్చా రు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అమూల్‌ కార్యకలాపాలను నిలిపివేశారు.

ఉద్యోగుల సమస్యలపై దృష్టి

ఈనేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి చొరవ చూపి డెయిరీ అవసరాన్ని, గతంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ప్రాథమికంగా డెయిరీ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కృషిచేసిన మంత్రి స్వామి.. అనంతరం సంస్థ పునరుద్ధరణ కోసం అధికారుల వద్ద ప్రయత్నాలు ప్రారంభిం చారు. అవసరమైన నివేదికలను ప్రభుత్వా నికి పంపేలా జిల్లా అధికారులకు సూచిం చారు. తదనుగుణంగా పూర్వపు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ప్రస్తుతం ఉన్న జేసీ గోపాలకృష్ణ ఆ అంశంపై దృష్టిపెట్టి ప్రభుత్వానికి నివేదించారు. ఇదేసమయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కూడా ఒకసారి సీఎంను కలిసి డెయిరీపై చర్చించారు. ఈక్రమంలో పాడి పరిశ్రమా భివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌ మంగళవారం సాయంత్రం డెయిరీని సందర్శించారు. ఆ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న పూర్వపు డైరెక్టర్‌ వెంకటరమణతో కలిసి డెయిరీ ప్రాంగణం అంతా తిరిగి చూశారు. పాలపొడి ఫ్యాక్టరీని అలాగే వివిధ విభాగాలలో ఉన్న మిషనరీని పరిశీలించారు.

అధికారులతో సమావేశం

ప్రస్తుతం డెయిరీ పర్యవేక్షకునిగా ఉన్న ఏపీడీడీసీఎఫ్‌ మేనేజర్‌ ఆర్‌.రాజమోహన్‌, జిల్లా పశుసంవర్థకశాఖ అధి కారి ఎన్‌.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో పలు అంశా లపై మురళీధర్‌ చర్చించారు. ప్రధానంగా డెయిరీ పునరు ద్ధరణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నివేదిం చాలని వారిని ఆదేశించారు. జిల్లాలో గతంలో ఒంగోలు డెయిరీ కార్యకలాపాలు జరిగిన గ్రామాలు, ప్రస్తుతం వాటిలో పాల ఉత్పత్తి, ఇతర అంశాలను పరిశీలించాలని సూచించారు. పశుసంవ ర్థకశాఖ అధికారులు టి.జయచంద్ర, డాక్టర్‌ జె.శ్రీనివాస్‌, డాక్టర్‌ ఎన్‌.భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 01:30 AM