Share News

చురుకైన కార్యకర్తలే పార్టీకి బలం

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:05 PM

పార్టీకి ఉత్తమ సేవలందించిన యూనిట్‌, క్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ పంపిన ప్రశంసాపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ చేతులమీదుగా పంపిణీ చేశారు.

చురుకైన కార్యకర్తలే పార్టీకి బలం
ప్రశంసాపత్రాలు అందించిన అనంతరం వారితో ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

ఉత్తమప్రతిభ కనబరిచిన యూనిట్‌, క్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే బీఎన్‌

సంతనూతలపాడు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి) : పార్టీకి ఉత్తమ సేవలందించిన యూనిట్‌, క్లస్టర్‌, బూత్‌ ఇన్‌చార్జ్‌లకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ పంపిన ప్రశంసాపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీవంటి చురుకైన కార్యకర్తలే పార్టీకి బలమని మంత్రి లోకేష్‌ తెలిపారని, ప్రజాసేవలో అంచెలంచెలుగా ఎదిగి ప్రజలు మెచ్చిన నాయకునిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ ఘనంగా దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొగాకు సమాఖ్య చైర్మన్‌ మండవ జయంత్‌బాబు, సీనియర్‌ నాయకులు మన్నం ప్రసాద్‌, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, బొడ్డపాటి చంద్రశేఖరరావు, నాలుగు మండలాల మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, గొట్టిపాటి రాఘవరావు, తేళ్ల మనోజ్‌కుమార్‌, ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:05 PM