తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:10 PM
ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న సరుకుల తూకాల్లో మోసా లకు పాల్పడితే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉషారాణి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్‌ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
పౌరసరఫరాల శాఖ జిల్లా
అసిస్టెంట్ మేనేజర్ ఉషారాణి హెచ్చరిక
పలుప్రాంతాల్లో అధికారుల తనిఖీలు
పామూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న సరుకుల తూకాల్లో మోసా లకు పాల్పడితే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉషారాణి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్‌ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం బస్తాలను తూకాలు వేసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ డీలర్లు, ఎండీవో ఆపరేటర్ల వద్ద తూకాల్లో మోసాలు జరిగితే అందుకు బాధ్యులపై తగిన చర్యలు తప్ప వన్నారు. ప్రతినెలా కార్డుదారులకు సక్రమంగా సరుకుల పంపిణీ జరిగేలా చూడలన్నారు. అనంతరం గోడౌన్‌లోని సరుకుల రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీటి మధుసూదనరావు, ఆపరే టర్ బి.కిరణ్ పాల్గొన్నారు.
పీసీపల్లిలో.. పీసీపల్లి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): స్థానిక ఇండేన్ గ్యాస్ గోడౌన్‌ను తహసీల్దార్ సీహెచ్ ఉష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. రికార్డులను పరిశీలించి గోడౌన్‌లో ఉన్న సిలిండర్‌లను పరిశీలించా రు. అధిక ధరలకు విక్రయించినా, సరఫరా చార్జీలు వసూలు చేసినా, నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక పీఎన్‌ఆర్ రైస్‌మిల్, పెట్రోల్ బంకు, చౌకధరల దుకాణం, ఆర్వో ప్లాంట్‌లలో తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి నిబంధనలమేర వ్యాపారం చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్ వెంట వీఆర్వోలు పిచ్చిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వీఆర్‌ఏలు దస్తగిరి, చిననరసింహం తదితరులు పాల్గొన్నారు.
కురిచేడులో.. కురిచేడు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): కురిచేడులోని రెండు పెట్రోలు బంకులు, గ్యాస్ గోడౌన్, సినిమా హాలు, మినరల్ వాటర్ ప్లాంట్‌లను మంగళవారం తహసీల్దార్ రజనీకుమారి తనిఖీ చేశారు. ప్రజ ల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. తహసీల్దార్ వెంట ఆర్‌ఐ నాగరాజు, వీఆర్వో నాగరాజు ఉన్నారు.
దర్శిలో.. దర్శి, ఏప్రిల్ 29(ఆంధ్ర జ్యోతి): దర్శి పట్టణంలో గ్యాస్ గోడౌన్‌ను, పెట్రోల్ బంక్‌లను రెవె న్యూ అధికారులు ఆకస్మికంగా త నిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ తహ సీల్దార్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ ప రిటాల శ్రీనివాసరావు సిబ్బందితో వెళ్లి దర్శి-అద్దంకి రోడ్డులోని గ్యాస్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. నిల్వ పాయింట్లు, నిబంధనలు పాటిస్తున్నారా అనే విషయాలను పరిశీంచారు. రిజిస్టర్లు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పెట్రోల్ బంక్‌లను పరిశీలించి రికార్డులను తనిఖీలు చేశారు. కార్యక్ర మంలో వీఆర్వో మురళీ, తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరులో.. తాళ్లూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తా ళ్లూరు, తూర్పుగంగవరం గ్రామాల్లోని పెట్రోలు బంక్‌లు, గ్యాస్‌ఏజన్సీలను మంగళవారం కె.సంజీవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ స్టాక్ రిజిష్టర్లు, ప్రభుత్వపథకాల ద్వారా అందుతున్న గ్యాస్ కనెక్షన్ల వివరాలను పరిశీలించారు. పెట్రోలు బంక్‌లో పెట్రోలు తరుగుదల లేకుండా నాణ్యమైన పెట్రోలు వినియోగదారులకు అందుతున్నదీ, లేనిది పరిశీలించారు. ఆయన వెంట వీఆర్‌వో పి.చంద్రశేఖర్‌రావు తదితరులు ఉన్నారు.
ముండ్లమూరులో.. ముండ్లమూరు, ఏప్రిల్(ఆంధ్రజ్యోతి): పేదలకు పంపిణీ చేస్తున్న నిత్యా వసర సరుకుల్లో అక్రమాలకు పాల్పడవద్దని డి ప్యూటీ తహసీల్దార్ ఆర్.శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మండలంలోని శింగన్నపాలెం, పెదఉల్ల గల్లు గ్రామాలలో రేషన్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్డుదారులకు ప్రతినెలా ఇస్తున్న సరుకుల వివరాలను రికార్డులతో సరిపో ల్చారు. కార్డుదారుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ముండ్లమూరులోని గ్యాస్ గోడౌన్, కార్యాలయాన్ని తనిఖీ చేశా రు. తదనంతరం పెట్రోల్‌బంక్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మూర్తి, వీఆర్వో రాఘవరెడ్డి, బ్రహ్మతేజ పాల్గొన్నారు.
రేషన్‌ను సక్రమంగా అందజేయాలి
కనిగిరి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాపంపిణీ సరుకు లను ఎంఎల్‌ఎస్ పాయింట్‌లకు సక్రమంగా అందేలా చూడాలని తహసీల్దార్ రవిశంకర్ అన్నారు. పట్టణ సమీపంలోని ఎంఎల్‌ఎస్ గోడౌన్‌ను మంగళవారం తహసీల్దార్ ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులను పరిశీ లించారు. గోడౌన్ ఇన్‌చార్జ్ కమ్రుద్దీన్‌ను స్టాకు వివరా లు అడిగి తెలుసుకున్నారు. అక్రమ రవాణాచేస్తూ పట్టుబడిన సరుకు వివరాలపై ఆరా తీశారు. 1518 బస్తాల రేషన్ బియ్య బస్తాలు ఉన్నట్లు తహసీల్దార్‌కు తెలిపారు.
అలాగే, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన స్టాకు సరుకు లను పరిశీలించారు. ప్రతినెలా 20వ తేదీ నుంచి నెలాఖరు వరకు సర ఫరా చేయాల్సిన రేషన్ బస్తాలు ఇంకా ఉండటంపై ఆయన గత రికా ర్డులను పరిశీలించారు. రేషన్ సరుకులు పంపిణీలో ఎలాంటి అవకత వకలు జరిగినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సిబ్బందిని హెచ్చరించారు. తహసీల్దార్ వెంట ఎఫ్‌ఐ శివగంగిరెడ్డి, వీఆర్వోలు బసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, గాయం ప్రసాద్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.