యూరియాను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:04 AM
రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే యూరియా విక్రయించాలని, భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు హెచ్చరించారు.
చీరాల, నవంబరు24 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే యూరియా విక్రయించాలని, భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు హెచ్చరించారు. గత శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన యూరియా బస్తా రూ.500 కథనానికి ఆర్డీవో స్పందించారు. విఆర్వోలతో కూడిన పలు బృందాలను ఏర్పాటు చేసి చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని దుకాణాల్లో తనిఖీలు చేయించారు. రికార్డులు పరిశీలించారు. నిర్వాహకులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. సమస్యలున్న రైతులు నేరుగా సంప్రదించాలని ఆర్డీవో స్పష్టం చేశారు.