ఇసుక లారీలను అడ్డుకుంటే చర్యలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:10 AM
ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుంటే చర్యలు తప్పవని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజశేఖర్ హెచ్చరించారు. ‘ఇసుక ప్రియం’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఆ మేరకు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.
మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హెచ్చరిక
ఒంగోలు ఇసుక యార్డు నిర్వాహకులకు నోటీసులు
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుంటే చర్యలు తప్పవని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజశేఖర్ హెచ్చరించారు. ‘ఇసుక ప్రియం’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఆ మేరకు ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఇసుక లారీలను అడ్డుకుంటున్న ప్రైవేటు సైన్యం ఒంగోలు ఇసుక యార్డుకు చెందిన వారిగా గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఒంగోలులోని స్టాక్ యార్డులో ఇసుక ధర టన్ను రూ.980గా నిర్ణయించామన్నారు. అయితే నెల్లూరు ఇసుక రీచ్ నుంచి నేరుగా బుక్ చేసుకొని వినియోగదారులు తెచ్చుకోవచ్చన్నారు. భూగర్భ, గనుల శాఖ అధికారులకు ఎలాంటి మామూళ్లు, లాలూచీ లేదని వివరించారు. ప్రస్తుతం ఇసుకకు కొరత లేదని చెప్పారు. యథేచ్ఛగా సొంత అవసరాల కోసం తరలించుకోవచ్చని స్పష్టం చేశారు.