Share News

ప్రభుత్వ స్థలాల్లో గ్రానైట్‌ వ్యర్థాలు వేస్తే చర్యలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:04 AM

ప్రభుత్వ స్దలాల్లో గ్రానైట్‌ వ్యర్థాలను వేస్తే చర్యలు తప్పవు అని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు హెచ్చరించారు. బుధవారం మండలంలోని మల్లాయపా లెం గ్రామ పరిధిలో ఉన్న పలు గ్రానైట్‌ క్వారీలు వేసి డంపింగ్‌లను ఆర్డీవో బాపట్ల మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌ పరిశీలించారు.

ప్రభుత్వ స్థలాల్లో గ్రానైట్‌ వ్యర్థాలు వేస్తే చర్యలు
మల్లాయపాలెంలో గ్రానైట్‌ క్వారీల వద్ద రికార్డులను తనిఖీ చేస్తున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌

మల్లాయపాలెంలో ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో, మైనింగ్‌ ఏడీ

బల్లికురవ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ స్దలాల్లో గ్రానైట్‌ వ్యర్థాలను వేస్తే చర్యలు తప్పవు అని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు హెచ్చరించారు. బుధవారం మండలంలోని మల్లాయపా లెం గ్రామ పరిధిలో ఉన్న పలు గ్రానైట్‌ క్వారీలు వేసి డంపింగ్‌లను ఆర్డీవో బాపట్ల మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌ పరిశీలించారు. మల్లాయపాలెం గ్రామానికి చెందిన లేమాటి హనుమంతురావు అనే వ్యక్తి కాలవ కట్టను పూడ్చి వ్యర్థాలు వేశారని హైకోర్టు ద్వారా ఫిర్యాదులు చేయగా అధికారులు డంపింగ్‌ వేసిన స్థలాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలను రైతులను ఇబ్బందులు చేస్తే క్వారీల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిస్థాయి పరిశీలనతో త్వరలో నివేదిక తయారు చేస్తామని వారు తెలిపారు. ఈ పరిశీలనలో తహసీల్దార్‌ రవినాయక్‌, మైనింగ్‌, రెవెన్యూ సర్వేయర్లు నాగలక్ష్మి, కిషోర్‌బాబు, చంద్ర పాల్గొన్నారు.

ఆర్ణా గ్రానైట్‌ క్వారీని మరో సారి

పరిశీలించిన అధికారులు

మల్లాయపాలెం గ్రామంలో ఉన్న ఆర్ణా గ్రానైట్‌ క్వారీని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, మైనింగ్‌ ఏడీ రాజే్‌షకుమార్‌ మరో మారు పరిశీలించారు. దారిని ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో ఒక సారి అధికారులు పరిశీలించారు. మరలా రికార్డులను పరిశీలించేందుకు అధికారులు క్వారీని తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రికార్డుల ప్రకారం ఎలా ఉంటే అలా ముం దుకు వెళతామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 10 , 2025 | 12:04 AM