డీజే బాక్స్‌లు వాడితే చర్యలు తప్పవు
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:05 PM
ఇష్టారీతిన డీజే సౌండ్ బాక్స్‌లు వాడితే చర్యలు తప్పవని మార్కాపురం సీఐ పి.సుబ్బారావు అన్నారు.
సీఐ సుబ్బారావు
మార్కాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఇష్టారీతిన డీజే సౌండ్ బాక్స్‌లు వాడితే చర్యలు తప్పవని మార్కాపురం సీఐ పి.సుబ్బారావు అన్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు డీజే బాక్స్‌ల ద్వారా ఇష్టారీతిన సౌండ్ పెట్టేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడంలేదన్నారు. ఈ శబ్దాల వలన చిన్నపిల్లలు, వృద్థులు, హృద్రోగ సమస్యలు ఉన్న వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలీసుశాఖ అనుమతితో పరిమితి కలిగిన సౌండ్ మాత్రమే పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. నిబందనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.