అమరావతి మహిళలను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:08 AM
సాక్షి చానల్‌లో జరిగిన డిటేబ్‌లో అమరావతి మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం కంభం, అర్ధవీడు మండలాల తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు పోలీసు స్టేషన్‌లో ఏఎ్‌సఐ నారాయణకు ఫిర్యాదు చేశారు.
కంభం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న తెలుగు మహిళలు
కంభం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సాక్షి చానల్‌లో జరిగిన డిటేబ్‌లో అమరావతి మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం కంభం, అర్ధవీడు మండలాల తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు పోలీసు స్టేషన్‌లో ఏఎ్‌సఐ నారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ జర్నలిస్టు కృష్ణంరాజుపై, డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసులు, సాక్షి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పం పాలని కోరారు. టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి, జడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్‌రెడ్డి తన సాక్షి చానల్‌లో ద్వారా మహిళలను కించపర్చేలా మాట్లాడించినందుకు ఆయన బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టౌన్ మహిళా నాయకురాలు ఆరేపల్లి సుభాషిణి, గొట్టిముక్కల మహాలక్ష్మి, విద్యా కమిటీ చైర్మన్ చింతలబోయిన విజయలక్ష్మి, అర్ధవీడు తెలుగు మహిళా నాయకురాలు కత్తి భారతి, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
పొదిలి : అమరావతి మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మార్కాపురం నియోజకవర్గ తెలుగు మహిళలు పొదిలి పట్టణం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.