విద్యుత్‌శాఖ కొండపి ఏఈఈపై వేటు
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:34 AM
విద్యుత్ శాఖ కొండ పి ఏఈఈ పువ్వాడి శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన్ను ఏపీసీపీడీసీఎల్ కంపెనీకి సరెండర్ చేస్తూ సీఎండీ పుల్లారెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆమేరకు శ్రీనివాసులును సింగ రాయకొండ ఏడీఈ యుగంధర్ రిలీవ్ చేశారు.
ఆయన్ను సరెండర్ చేస్తూ ఏపీసీపీడీసీఎల్ సీఎండీ ఉత్తర్వులు
కొండపి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ శాఖ కొండ పి ఏఈఈ పువ్వాడి శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన్ను ఏపీసీపీడీసీఎల్ కంపెనీకి సరెండర్ చేస్తూ సీఎండీ పుల్లారెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆమేరకు శ్రీనివాసులును సింగ రాయకొండ ఏడీఈ యుగంధర్ రిలీవ్ చేశారు. విద్యుత్ కనెక్షన్‌ల విషయంలో ఏఈఈ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ‘విద్యుత్‌శాఖలో వసూల్ రాజా’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆయన అవినీతిపై ఈనెల 10వ తేదీన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఉన్నతాధికారులు ఈనెల 11న డీఈఈ స్థాయి అధికారితో విచారణ చేయించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎండీ చర్యలు తీసుకున్నారు.