ఘాట్ రోడ్డులో ప్రమాదం
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:37 PM
ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు వేగం అదుపు తప్పి ఢీకొన్న సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండల ఫరిదిలోని నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో తుమ్మలబైలు-చిన్నారుట్ల మధ్య మూలమలుపు వద్ద సోమవారం చోటుచేసుకుంది.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
పలువురికి స్వల్ప గాయాలు
5 గంటల నిలిచిన రాకపోకలు
పెద్ద దోర్నాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు వేగం అదుపు తప్పి ఢీకొన్న సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండల ఫరిదిలోని నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో తుమ్మలబైలు-చిన్నారుట్ల మధ్య మూలమలుపు వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నూజివీడు బస్సు డ్రైవర్ ప్రవీణ్, ఆత్మకూరు బస్సు డ్రైవర్‌లు షేక్షావలి, నారాయణ, తెనాలికి చెందిన శ్రీలక్ష్మీ, వెంకటరావు, గోపి, రాధిక, విజయవాడకు చెందిన రామిరెడ్డిలకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వైపు వెళ్తుండగా, నూజివీడు డిపోకు చెందిన బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తోంది. మూలమలుపు వద అదుపు తప్పి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఢీకొన్న రెం డు బస్సులు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. పరిస్థితి గమనించిన కొం దరు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను దోర్నాల ప్రభు త్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికి త్స నిర్వహించారు. బాధితులు దో ర్నాల పోలీసుస్షేనులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
5 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని రోడ్డుకు అడం్డగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు 5 గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. ఘటనా స్థలం రెండు వైపులా కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు పలు ఇక్కట్లకు గురయ్యారు. వాతావరణం చల్లగా ఉండడం కొంత ఊరట నిచ్చింది. పోలీసు సిబ్బంది ఎక్స్‌కవేటర్‌తో స్థలానికి వెళ్లి రెండు బస్సులను పక్కకు తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.