Share News

ఎస్సీ హాస్టల్‌లో ప్రమాదం

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:21 AM

సింగరాయకొండలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఒక విద్యార్థి ఆగ్నిప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన స్వర్ణ ఆంజనేయులు సింగరాయకొండ ప్రభుత్వ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్‌ ప్రాంగణంలో విద్యార్థులు చెత్తను పోగుచేసి నిప్పంటించి చలికాచుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆంజనేయులు ఆ మంటల్లో పడ్డాడు.

ఎస్సీ హాస్టల్‌లో ప్రమాదం
ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న మంత్రి స్వామి

మంటల్లో పడి విద్యార్థికి గాయాలు

పరామర్శించిన మంత్రి స్వామి

సింగరాయకొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఒక విద్యార్థి ఆగ్నిప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన స్వర్ణ ఆంజనేయులు సింగరాయకొండ ప్రభుత్వ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్‌ ప్రాంగణంలో విద్యార్థులు చెత్తను పోగుచేసి నిప్పంటించి చలికాచుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆంజనేయులు ఆ మంటల్లో పడ్డాడు. వెంటనే సహచర విద్యార్థులు పక్కకు లాగారు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశాలతో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం 108లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థి ఆంజనేయులును శనివారం మంత్రి స్వామి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Updated Date - Jul 27 , 2025 | 01:21 AM