వైభవంగా మాసశివరాత్రి అభిషేకాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:14 PM
ఒంగోలు నగరం త్రోవగుంట గ్రామంలోని శ్రీగంగా పార్వతీసమేత శ్రీమూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి మాస శివరాత్రి అభిషేకాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు ఆమంచి ఉదయభాస్కర్ వైభవంగా నిర్వహించారు
త్రోవగుంట గ్రామంలో శ్రీగంగా పార్వతీసమేత మూల స్థానేశ్వర స్వామిదేవాలయంలో పూజలు
మాసదీపాలను వెలిగించిన మహిళలు
ఒంగోలు రూరల్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరం త్రోవగుంట గ్రామంలోని శ్రీగంగా పార్వతీసమేత శ్రీమూల స్థానేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి మాస శివరాత్రి అభిషేకాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు ఆమంచి ఉదయభాస్కర్ వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో రుద్రాభిషేకాలు చేశారు. సాయంత్రం ప్రదోష కాలంలో ముందుగా శివపార ్వతులకు, అనంతరం నందీశ్వరుడుకి మహాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కార్తీక మాస దీపాలను వెలింగిచారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మాస శివరాత్రి సందర్భంగా శివాలయంలో శివపార్వతులను భక్తులు ఊరేగించారు. ఈ కార్యక్రమాలలో అయ్యప్ప, శివ దీక్షధారులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.