Share News

ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:12 AM

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓ టుకు ఆధార్‌నంబరును తప్పనిసరిగా అను సంధానం చేసుకోవాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. అర్హత ఉన్నప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.

 ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 3 (ఆంధ్రజ్యో తి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓ టుకు ఆధార్‌నంబరును తప్పనిసరిగా అను సంధానం చేసుకోవాలని ఆర్డీవో లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. అర్హత ఉన్నప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఒంగోలులోని ఆ ర్డీవో కార్యాలయంలో గురువారం గుర్తింపు ఉ న్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ఎన్ని కల సంఘం నిబంధనల ప్రకారం దేశంలో ఏ పౌరుడికైనా ఒకచోట ఒక ఓటు మాత్రమే ఉం డాలని నిబంధనలు చెప్తున్నాయన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొంత మంది రెం డు, మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారని, అ టువంటి ఓట్లను ఆధార్‌ అనుసంధానంతో తొ లగిస్తామని చెప్పారు.

రెండు ఓట్లు కలిగి ఉ న్నవారు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అ క్కడే తమ ఓటును కలిగి ఉండే విధంగా రా జకీయపార్టీలు కూడా సహకరించాలన్నారు. ఓటుకు ఆధార్‌ నంబరు అనుసంధానం చేసు కోని ఓట్లను తొలగిస్తామని పేర్కొన్నారు. ఒం గోలు నియోజకవర్గ ఓటర్ల జాబితా ఎటువం టి తప్పులు లేకుండా సరి చేస్తామన్నారు. 18 ఏళ్ళు నిండిన వారందరికి ఓటు హక్కుతో పాటు కొత్త పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అందుకు అవసరమై న సూచనలు, సలహాలు రాజకీయ పార్టీల నా యకులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడంతో వాటి పై ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో తహసీల్దార్‌ మధుసూ దనరావు, ఏపీసీ సుధాకరరావు, ఎన్నికల సెల్‌ డీటీ సలోమి, పద్మజనాయుడు, సాయి, దాసు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వరూప్‌, క్రాం తికుమార్‌, గుర్రం సత్యనారాయణ, రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 08:21 AM