ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి
ABN , Publish Date - May 31 , 2025 | 12:09 AM
ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చే యించుకునే విధంగా సహకరించాలని ఆర్డీవో లక్ష్మీప్రస న్న కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆర్డీవో లక్ష్మీప్రసన్న
ఒంగోలు కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చే యించుకునే విధంగా సహకరించాలని ఆర్డీవో లక్ష్మీప్రస న్న కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతినెలా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటుకు ఆధార్ అను సంధానం చేసుకోని వారి ఓట్లను తొలగిస్తామని స్ప ష్టం చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబి తాలో ఎటువంటి తప్పులు లేకుండా సరి చేస్తామని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. చనిపోయిన వారి ఓ ట్లను తొలగించడంతో పాటు పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాల కల్పన, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆయా అం శాలపై రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తావించిన ప లు అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని ఆర్డీవో తె లిపారు. కార్యక్రమంలో నగర అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, శివప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ అశోక్, రాజకీయ పార్టీల నాయకులు స్వరూప్, క్రాంతికుమార్, రసూల్, రాయపాటి అరుణ, జి.సత్యం పాల్గొన్నారు.