Share News

ప్రతి ఇంటా సంక్షేమ పండుగ

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:41 PM

ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం, సంతోషం కలుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను 1వ వార్డులో గల గణేష్‌ నగర్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ప్రతి ఇంటా సంక్షేమ పండుగ
పింఛన్‌లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం, సంతోషం కలుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను 1వ వార్డులో గల గణేష్‌ నగర్‌లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా 106 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధురాలికి పింఛన్‌ ఇచ్చి ఆమె నుంచి ఆశీర్వాదం పొందారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిలో ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు షానేషావలి, మార్కెట్‌యార్డు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ బైలడుగు బాలయ్య, గోడి ఓబులరెడ్డి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, బీజేపీ నాయకులు జేవీ నారాయణ, స్థానిక నాయకులు షేక్‌ జాఫర్‌, షేక్‌ అహమ్మద్‌బాషా, తోట శేషగిరిరావు, కౌన్సిలర్‌ బి.చంద్రశేఖర్‌యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఈవీ రమణబాబు, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే కందుల

మార్కాపురం : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యే యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌లను ఆయన బుధవారం నియోజకవర్గంలోని పలుచోట్ల పంపిణీ చేశారు. ఏకలవ్య కాలనీలో పెన్షన్‌ అందజేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించడమేకాక అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు, ఏఎంసీ చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ పార్టీ అఽధ్యక్షులు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, మాజీ అధ్యక్షుడు షేక్‌ మౌళాలి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

వృద్ధుల కళ్లల్లో ఆనందం : ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం : వృద్ధుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని వై కొత్తపల్లి గ్రామంలో బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పీ రామసుబ్బయ్య, టీడీపీ మండల నాయకులు వేగినాటి శ్రీను, చిట్యాల వెంగళరెడ్డి, సత్యనారాయణగౌడ్‌, పేరం రమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు పి మల్లికార్జునరావు, తోట మహేష్‌ పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.

కలెక్టర్‌, ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ వీ విష్ణువర్ధన్‌రాజును బుధవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వారి కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై వారితో చర్చించారు.

Updated Date - Oct 01 , 2025 | 11:41 PM